Mon Dec 23 2024 08:22:42 GMT+0000 (Coordinated Universal Time)
డిఫెండింగ్ ఛాంపియన్స్ కు ఘోర ఓటమి
డిఫెండింగ్ ఛాంపియన్స్ గా 2023 ప్రపంచ కప్లో అడుగుపెట్టిన ఇంగ్లాండ్
డిఫెండింగ్ ఛాంపియన్స్ గా 2023 ప్రపంచ కప్లో అడుగుపెట్టిన ఇంగ్లాండ్ మరో పరాజయాన్ని మూటగట్టుకుంది. ఇక మిగిలిన మ్యాచ్ లన్నీ గెలిస్తే తప్పితే సెమీస్ కు వెళ్లే అవకాశాలు ఇంగ్లండ్ కు ఉన్నాయి. వాంఖడే వేదికగా దక్షిణాఫ్రికాతో జరిగిన మ్యాచ్లో ఇంగ్లాండ్ 229 పరుగుల భారీ తేడాతో ఓడింది. ఆడిన నాలుగు మ్యాచ్ల్లో ఇంగ్లండ్ మూడింట ఓడింది. 400 పరుగుల లక్ష్యంతో ఇంగ్లండ్ దిగగా.. కనీసం పోరాడకుండా ఓటమి పాలైంది. 170 పరుగులకే ఇంగ్లండ్ ఆలౌట్ అయింది. ఆఖర్లో వచ్చిన మార్క్ వుడ్ 17 బంతుల్లో చేసిన 43 పరుగులే ఇంగ్లండ్ ఇన్నింగ్స్ లో టాప్ స్కోరు. గస్ అట్కిన్సన్ 35 పరుగులు చేశాడు. మలాన్, బట్లర్, బ్రూక్, బెన్ స్టోక్స్, రూట్ ఎవరూ కూడా ప్రభావం చూపించలేకపోయారు.
టాస్ ఓడి బ్యాటింగ్ దిగిన సఫారీలు నిర్ణీత 50 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 399 పరుగులు చేసింది. ప్రారంభంలోనే డికాక్ వికెట్ కోల్పోయినా వాండెర్ డస్సెన్(60) రీజా హెన్డ్రిక్స్(85) ఇన్నింగ్స్ ను చక్కదిద్దారు. ఆ తర్వాత వచ్చిన కెప్టెన్ మార్కరం 42 పరుగులు చేశాడు. ఆఖర్లో హెన్రిచ్ క్లాసన్ 67 బంతుల్లోనే 109 పరుగులు చేశాడు. ఆల్ రౌండర్ మార్కో జాన్సెన్ 42 బంతుల్లో 75 పరుగులు చేశాడు. ఇంగ్లాండ్ బౌలర్లలో టోప్లేకు మూడు వికెట్లు, అదిల్ రషీద్, అట్కిన్సన్ కి రెండు వికెట్లు దక్కాయి. క్లాసెన్ కు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ లభించింది.
Next Story