Mon Dec 23 2024 03:52:13 GMT+0000 (Coordinated Universal Time)
పండంటి మగబిడ్డకు జన్మనిచ్చిన యువరాజ్ దంపతులు
యువరాజ్ చెప్పిన ఈ శుభవార్త.. అభిమానులను ఖుషీ చేస్తోంది. అభిమానులు, నెటిజన్లంతా యువరాజ్ కు శుభాకాంక్షలు తెలుపుతున్నారు.
టీమిండియా మాజీ ఆల్ రౌండర్ యువరాజ్ సింగ్ (యూవీ) తన అభిమానులకు అదిరిపోయే గుడ్ న్యూస్ చెప్పాడు. తాను తండ్రిని అయ్యానంటూ సోషల్ మీడియా వేదికగా వెల్లడించాడు యువరాజ్. తన భార్య హేజల్ కీచ్ పండంటి మగబిడ్డకు జన్మనిచ్చిందని తెలిపాడు. అభిమానులు, కుటుంబ సభ్యులు, స్నేహితులతో ఈ విషయాన్ని పంచుకోవడం ఎంతో ఆనందంగా ఉందని చెప్పుకొచ్చాడు యువరాజ్.
ఈ ప్రపంచంలోకి, తమ కుటుంబంలోకి ఓ చిన్నారి వచ్చిన సందర్భంగా తమ గోప్యతను అభిమానులు అందరూ గౌరవించాలని యువరాజ్ విజ్ఞప్తి చేశాడు. యువరాజ్ చెప్పిన ఈ శుభవార్త.. అభిమానులను ఖుషీ చేస్తోంది. అభిమానులు, నెటిజన్లంతా యువరాజ్ కు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. మాజీ క్రికెటర్ ఇర్ఫాన్ పఠాన్ సోషల్ మీడియాలో యువరాజ్ కు అభినందనలు తెలిపారు. సోదరా నువ్వు గొప్ప తండ్రివి అవుతావు చిన్నారిపై బోల్డంత ప్రేమ కురిపిస్తావు అంటూ కామెంట్ చేశారు. 2016 సంవత్సరంలో యువరాజ్ హేజల్ కిచ్ లకు పెళ్లి జరుగగా.. ఐదేళ్లకు ఆ దంపతులకు సంతానం కలిగింది.
Next Story