Sun Dec 22 2024 21:12:25 GMT+0000 (Coordinated Universal Time)
రాజస్థాన్ క్రికెటర్ రోహిత్ శర్మ కన్నుమూత
రాజస్థాన్ క్రికెటర్ రోహిత్ శర్మ కన్నుమూశారు. ఓపెనింగ్ బ్యాట్స్మెన్
రాజస్థాన్ క్రికెటర్ రోహిత్ శర్మ కన్నుమూశారు. ఓపెనింగ్ బ్యాట్స్మెన్ అయిన రోహిత్ శర్మ 40 ఏళ్ల వయసులో ప్రాణాలు వదిలాడు. కాలేయ సంబంధిత వ్యాధితో మరణించాడని రాజస్థాన్ క్రికెట్ సంఘం తెలిపింది. రోహిత్ శర్మ మంచి క్రికెటర్ అని.. అతడు ప్రాణాలు కోల్పోవడాన్ని జీర్ణించుకోలేకపోతున్నామని తెలిపారు.
రోహిత్ శర్మ వారం నుండి జైపూర్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. కుడిచేతి వాటం ఓపెనర్ రోహిత్ శర్మ తన మంచి బ్యాటింగ్ నైపుణ్యంతో రాజస్థాన్ క్రికెట్ లో ఓ వెలుగు వెలిగాడు. 7 ఫస్ట్-క్లాస్ మ్యాచ్లు ఆడాడు. లిస్ట్ A క్రికెట్ లో 28 మ్యాచ్లలో పాల్గొన్నాడు, రెండు సెంచరీలు, మూడు అర్ధ సెంచరీలతో సహా 35 కంటే ఎక్కువ సగటుతో మొత్తం 850 పరుగులు చేశాడు. రోహిత్ శర్మ 4 T20 మ్యాచ్లలో ఆడాడు. అతను తన లెగ్-స్పిన్ బౌలింగ్ లో 6 వికెట్లు తీశాడు. అతని క్రికెట్ ప్రయాణం 2004 నుండి 2014 వరకు సాగింది. అతను ప్రొఫెషనల్ క్రికెట్ నుండి రిటైర్మెంట్ తర్వాత కోచ్ గా కూడా మారాడు. RS క్రికెట్ అకాడమీలో ఎంతో మంది క్రికెటర్ల ట్యాలెంట్ ను బయటకు తీశాడు. రోహిత్ శర్మ మృతి పట్ల పలువురు క్రికెటర్లు సంతాపం వ్యక్తం చేస్తున్నారు.
Next Story