Wed Mar 26 2025 17:07:23 GMT+0000 (Coordinated Universal Time)
India Vs Nezealand Finals Champions Trophy : బలమైన జట్ల మధ్య రసవత్తరమైన పోటీ
ఈరోజు భారత్ - న్యూజిలాండ్ మధ్య ఛాంపియన్స్ ట్రోఫీలో ఫైనల్స్ మ్యాచ్ జరుగుతుంది

ఈరోజు భారత్ - న్యూజిలాండ్ మధ్య ఛాంపియన్స్ ట్రోఫీలో ఫైనల్స్ మ్యాచ్ జరుగుతుంది. మధ్యాహ్నం 2.30 గంటలకు మ్యాచ్ దుబాయ్ వేదికగా ప్రారంభంకానుంది. అయితే ఈ మ్యాచ్ లో రెండు జట్లు ఢీ అంటే ఢీ అని తలపడబోతున్నాయి. దేశాభిమానం పక్కన పెడితే అసలైన క్రికెట్ నేడు ఎంజాయ్ చేయవచ్చు. దుబాయ్ పిచ్ భారత్ టీంకు అలవాటు అని చెబుతున్నా ఎప్పటికప్పుడు మారుతుంటుందని కెప్టెన్ రోహిత్ శర్మ చేసిన వ్యాఖ్యల్లో కూడా నిజం లేకపోలేదు. దుబాయ్ పిచ్ లో భారీ స్కోరు అయితే సాధ్యం కాదన్నది వాస్తవం. టాస్ గెలిచిన వాళ్లు తొలుత బ్యాటింగ్ ను ఎంచుకుంటారని క్రీడానిపుణులు చెబుతారు. ఎందుకటే రాను రాను పిచ్ పరిస్థితి మారిపోతుంది.
స్పిన్నర్లదే హవా...
అయితే దుబయ్ పిచ్ పై స్పిన్నర్లదే హవా ఉంటుంది. స్పిన్నర్ల బంతి నుంచి తప్పించుకుని ఆడటం అంత సులువు కాదంటున్నారు. బంతి ఎటు టర్న్ అవుతుందో చెప్పలేం. అనేక మంది అలాగే అవుటయి అవాక్కయిన ఘటనలు అనేకం చూశాం. కన్నుమూసి తెరిచే లోగా వికెట్ పడిపోయి ఉంటుంది. అదే సమయంలో బంతి వేగంగా వచ్చినా దానిని కొట్టేందుకు ప్రయత్నిస్తే అవుట్ అయ్యే ప్రమాదముంది. స్టంపింగ్ క్ కూడా అంతే అవకాశాలున్నాయి. అయితే భారత్, న్యూజిలాండ్ జట్లలో సమర్థులైన స్పిన్నర్లున్నారు. భారత్ లో అయితే జడేజా, కులదీప్ యాదవ్, అక్షర్ పటేల్, వరుణ్ చక్రవర్తిలు బంతిని తిప్పేస్తూ బ్యాటర్లను తికమక పెట్టేలా బౌల్ చేస్తారు.
న్యూజిలాండ్ స్క్కాడ్ లోనూ...
అదే సమయంలో న్యూజిలాండ్ స్క్కాడ్ లోనూ అదే తరహాలో స్పిన్నర్లున్నారు. శాంటర్న్, బ్రాస్ వెల్, ఫిలిప్స్, రచిన్ రవీంద్రలు స్పిన్ మాయాజాలంతో ఆకట్టుకుంటున్నారు. రెండు జట్లలో నలుగురేసి స్పిన్నర్లు మ్యాచ్ విజయాన్ని డిసైడ్ చేసే అవకాశాలున్నాయి. ఎవరు వేగంగా వికెట్లు తీయగలిగి, పరుగులను తక్కువగా ఇవ్వగలిగితే వారిదే విజయం. ఇక బ్యాటింగ్ లోనూ రెండు జట్లు సమానంగా ఉన్నప్పటికీ, న్యూజిలాండ్ బ్యాటింగ్ పరంగా మరింత బలంగా కనిపిస్తుంది. విలయమ్సన్, యంగ్, మిచెల్, రచిన్ రవీంద్ర వంటి వారితో పాటు అందరూ ఫుల్లు ఫామ్ లో ఉన్నారు. పైగా కివీస్ జట్టు ఒత్తిడిలో ఏ మాత్రం తడబడకుండా లక్ష్యాన్ని చేరుతుంది. అందుకే భారత్ చాలా జాగ్రత్తగా ఉండాలి. ఆచితూచి ఆడాలి. అప్పుడే కప్పు మన సొంతమవుతుంది. ఇప్పటి వరకూ ట్రోఫీలో తిరుగులేని ఆధిపత్యాన్ని ప్రదర్శించిన టీం ఇండియా మరో విజయాన్ని అందుకుంటుందని ఆశిద్దాం.
Next Story