Mon Dec 23 2024 07:36:26 GMT+0000 (Coordinated Universal Time)
India vs Afghanistan Third T20 : నేడు మూడో మ్యాచ్...క్లీన్ స్వీప్ చేసేస్తారా?
ఇండియా - ఆప్ఘనిస్తాన్ ల మధ్య చివరి మూడో టీ 20 జరగనుంది. బెంగళూరు వేదికగా ఈ మ్యాచ్ ప్రారంభం కానుంది
ఇండియా - ఆప్ఘనిస్తాన్ ల మధ్య చివరి మూడో టీ 20 జరగనుంది. బెంగళూరు వేదికగా ఈ మ్యాచ్ ప్రారంభం కానుంది. బెంగళూరులోని చిన్న స్వామి స్టేడియానికి చేరుకున్న ఇరు జట్లు ఇప్పటికే ప్రాక్టీస్ ను ప్రారంభించాయి. రాత్రి ఏడు గంటలకు మ్యాచ్ ప్రారంభం కానుంది. మూడు మ్యాచ్ ల టీ 20 సిరీస్ లో ఇప్పటికే భారత్ రెండు మ్యాచ్ లు గెలిచి సిరీస్ ను దక్కించుకుంది. నేడు జరగబోయే మ్యాచ్ నామమాత్రమే. ఈ మ్యాచ్ లో భారత్ కొన్ని మార్పులు చేర్పులు చేసే అవకాశముంది.
రెండు మ్యాచ్ లలో...
తొలి రెండు మ్యాచ్ లలో గెలిచిన భారత్ జట్టు ఈ మ్యాచ్ లోనూ గెలిచి సిరీస్ ను క్లీన్ స్వీప్ చేయాలని భావిస్తుంది. ఆప్ఘనిస్తాన్ మాత్రం మూడింటిలో ఒక్కదానిలోనైనా గెలిచి పరువు నిలుపుకోవాలని చూస్తుంది. మొహాలీలో జరిగిన మ్యాచ్ లోనూ, ఇండోర్ లో జరిగిన మ్యాచ్ లోనూ కెప్టెన్ రోహిత శర్మ విఫలమయ్యాడు. ఓపెనర్ గా వచ్చి డకౌట్ గా వెనుదిరగాల్సి వచ్చింది. ఈరోజు అయినా కెప్టెన్స్ ఇన్నింగ్స్ ఆడాలని రోహిత్ అభిమానులు కోరుకుంటున్నారు. మరి రోహిత్ శర్మ ఏం చేయనున్నాడన్నది చూడాలి.
మార్పులు.. చేర్పులు...
మొహాలీ, ఇండోర్ లో ఆరు వికెట్ల తేడాతో విజయం సాధించింది. అయితే ఈ రెండు మ్యాచ్ లలో శివమ్ దూబే బ్యాక్ టు బ్యాక్ హాఫ్ సెంచరీలు చేసి జట్టుకు విజయాన్ని అందించాడు. రెండో మ్యాచ్ లో క్రీజులోకి వచ్చిన యశస్వి జైశ్వాల్, విరాట్ కొహ్లి కూడా బాగానే ఆడారు. ఈరోజు జరిగే మ్యాచ్ లో జితేష్ శర్మ స్థానంలో సంజూ శాంసన్ ను దింపే అవకాశాలున్నాయి. ఈ మ్యాచ్ లో గెలిచి భారత్ క్లీన్ స్వీప్ చేయాలని చూస్తుంది. అదే సమయంలో ఆప్ఘనిస్తాన్ ను తక్కువగా అంచనా వేయడానికి వీలులేదు. అందుకే చిన్న స్వామి స్టేడియంలో ఎవరిది విజయం అన్న ఉత్కంఠ అభిమానుల్లో నెలకొంది.
Next Story