Fri Dec 20 2024 20:08:21 GMT+0000 (Coordinated Universal Time)
నిలకడగా ఆడుతున్న భారత్
భారత్ - న్యూజిలాండ్ మధ్య తొలి వన్డే మ్యాచ్ ప్రారంభమయింది. టాస్ గెలిచిన న్యూజిలాండ్ ఫీల్డింగ్ ఎంచుకుంది
భారత్ - న్యూజిలాండ్ మధ్య తొలి వన్డే మ్యాచ్ ప్రారంభమయింది. టాస్ గెలిచిన న్యూజిలాండ్ ఫీల్డింగ్ ఎంచుకుంది. దీంతో తొలుత భారత్ బ్యాటింగ్ కు దిగింది. మొత్తం మూడు మ్యాచ్ ల సిరీస్ లో ఇది తొలి వన్డే. ఇప్పటికే టీ 20 సిరీస్ ను కైవసం చేసుకున్న భారత్ వన్డే సిరీస్ ను కూడా సొంతం చేసుకోవాలని చూస్తుంది. అయితే న్యూజిలాండ్ మాత్రం టీ 20 సిరీస్ కోల్పోయినా వన్డే సిరీస్ లో సొంతగడ్డపై సత్తా చాటాలని శ్రమిస్తుంది.
అత్యధిక పరుగులు చేస్తేనే....
శిఖర్ ధావన్ కెప్టెన్ గా బరిలోకి దిగిన టీం ఇండియా బౌలింగ్, బ్యాటింగ్ లో పటిష్టంగా ఉంది. తొలుత శిఖర్ ధావన్, శుభమన్ గిల్ బరిలోకి దిగారు. పది ఓవర్లు ముగిసేసరికి నలభై పరుగులు చేసింది. భారీగా లక్ష్యాన్ని న్యూజిలాండ్ ముందు ఉంచగలిగితేనే ఈ మ్యాచ్ విజయం సాధ్యమవుతుంది. న్యూజిలాండ్ ను కూడా తక్కువగా అంచనా వేయడానికి వీలు లేదు. అది కూడా అన్ని రంగాలలో బలంగా ఉంది.
- Tags
- india
- new zealand
Next Story