Wed Apr 09 2025 19:21:30 GMT+0000 (Coordinated Universal Time)
Yashaswi Jaishwal : యశస్వీ.. దంచవయ్యా .. దంచూ
నేడు ఇండియా - ఆప్ఘనిస్తాన్ తొలి టీ 20 మ్యాచ్ జరగనుంది. యశస్వి జైశ్వాల్ పై ఎక్కువగా అంచనాలు వినిపిస్తున్నాయి

నేడు ఇండియా - ఆప్ఘనిస్తాన్ తొలి టీ 20 మ్యాచ్ జరగనుంది. ఈ మ్యాచ్ మరికాసేపట్లో మొహాలీ వేదికగా ప్రారంభం కానుంది. అయితే అందరి చూపు యశస్వి పైనే ఉంది. మొహాలీ పిచ్ బ్యాటింగ్ కు అనుకూలం కావడంతో యశస్వి జైశ్వాల్ పై ఫ్యాన్స్ ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. ఓపెనర్ గా దిగనున్న యశస్వి వీర బాదుడు బాదితేనే భారత్ ఎక్కువ స్కోరు నమోదు చేయగలుగుతుంది. యశస్వి దూకూడు గానే ఆడతాడు. స్ట్రోక్స్ కూడా బలంగానే ఉంటాయి. సిక్సర్లు, ఫోర్లు దంచి కొడతాడు.
అంచనాలు మామూలుగా...
అయితే ఎంత ఎక్కువ సేపు క్రీజులో నిలబడితే అంత భారత్ కు లాభం. అయితే టాస్ గెలిచి ముందు భారత్ బ్యాటింగ్ చేస్తే యశస్వి జైశ్వాల్ కుదరుగా ఆడి పెద్ద స్కోరును చేయాలని ఫ్యాన్స్ కోరుతున్నారు. యశస్వి జైశ్వాల్ నిలదొక్కుకుంటే ప్రత్యర్థి బౌలర్లకు చుక్కలు కనపడతాయి. ప్రతి బంతి బౌండరీ లైను వైపు పరుగులు తీసేలా బ్యాట్ ఝుళిపిిస్తాడు. అందుకే అంచనాలు యశస్వి మీద ఎక్కువగానే ఉన్నాయి. టీ 20 స్పెషలిస్ట్ గా టీం ఇండియాలో ప్లేస్ సంపాదించుకున్నాడు.
కుర్రోళ్లు వచ్చేస్తున్నారు...
రాజస్థాన్ రాయల్స్ లో ఇరగదీసిన యశస్వి జైశ్వాల్ తర్వాత ఇక వెనురిగి చూసుకోలేదు. అయితే ఈ మ్యాచ్ లో ఎలా రాణిస్తాడన్నది చూడాలి. భారత్ కు ఇప్పుడు బ్యాటర్ల కొరత లేదు. యంగ్ టైగర్లు వరస పెడుతున్నారు. అందుకే తన కెరీర్ను పిచ్ పై కొంతకాలం చూడాలనుకుంటే ఆచి తూచి ఆడాల్సిందే. అలాగే భారత్ విజయంలో పాత్ర పోషించాలి. యశస్వి మీదనే ఎందుకింత వత్తిడి అంటే... మిగిలిన వాళ్లు సీనియర్లు. రింకూ సింగ్ ఫోర్త్ లేదా ఫిఫ్త్డౌన్ లో వచ్చే అవకాశాలున్నాయి. రింకూ సింగ్ నుంచి మాత్రమే కాదు వెనకనే తిలక్ వర్మ, రుతురాజ్ గైక్వాడ్ వంటి వాళ్లు కూడా ఉండటంతో యశస్వికి ఈ సిరీస్ సవాల్ అని అంటున్నారు క్రీడా నిపుణులు.
Next Story