Sun Dec 22 2024 17:34:39 GMT+0000 (Coordinated Universal Time)
T 20 : రేపు భారత్ - ఆస్ట్రేలియా మధ్య తొలి టీ 20 మ్యాచ్
రేపు భారత్ - ఆస్ట్రేలియా మధ్య తొలి టీ 20 మ్యాచ్ జరగనుంది. ఇందుకు విశాఖ వేదిక కానుంది
రేపు భారత్ - ఆస్ట్రేలియా మధ్య తొలి టీ 20 మ్యాచ్ జరగనుంది. ఇందుకు విశాఖ వేదిక కానుంది. వరల్డ్ కప్ ముగిసిన ఐదు రోజుల్లోనే టీ 20 సిరీస్ జరుగుతుండటం అభిమానులకు పండగే. మొత్తం ఐదు టీ 20 మ్యాచ్ లు భారత్ లో జరగనున్నాయి. రాత్రి ఏడు గంటలకు విశాఖలో ఈ మ్యాచ్ ప్రారంభం కానుంది. ఇప్పటికే ఇరు దేశాలు తమ జట్లను ప్రకటించాయి. రెండు జట్లు ఈ సిరీస్ ను తమ సొంతం చేసుకోవాలని ఉవ్విళ్లూరుతున్నాయి. టీ 20 మ్యాచ్ కావడంతో సహజంగానే క్రికెట్ ఫ్యాన్స్ లో ఉత్సాహం ఉంటుంది.
విశాఖలో అలెర్ట్...
భారత్ మాత్రం సీనియర్లకు విశ్రాంతి నిచ్చింది. సూర్యకుమార్ ను కెప్టెన్ గా ప్రకటించింది. ఆస్ట్రేలియా కూడా స్వల్ప మార్పులతో తమ జట్టును ప్రకటించింది. వరల్డ్ కప్ లో గెలిచిన కాన్ఫిడెన్స్ తో ఆస్ట్రేలియా ఉండగా, తృటిలో చేజారిపోయిన వరల్డ్ కప్ విషయంలో నిరాశ పడకుండా ఈ టీ 20 సిరీస్ ను చేజిక్కించుకోవాలని భారత్ భావిస్తుంది. యువ జట్టు రంగంలోకి దిగుతుంది. ఇది ప్రయోగంగానే చూడాలి. రేపటి మ్యాచ్ కు టిక్కెట్లన్నీ హాట్ కేకుల్లా అమ్ముడుపోయాయి. పోలీసులు రేపు జరగబోయే మ్యాచ్ కు భారీ భధ్రతను ఏర్పాటు చేస్తున్నారు.
Next Story