Sun Apr 06 2025 17:22:55 GMT+0000 (Coordinated Universal Time)
India vs England T20 : ఫ్యూచర్ మీదే గురూ.. తమ్ముడూ.. కుమ్మేయండి
భారత్ - ఇంగ్లండ్ తొలి టీ 20 మ్యాచ్ నేడు ప్రారంభం కానుంది. కోల్ కత్తా వేదికగా ఈ మ్యాచ్ రాత్రి ఏడు గంటలకు ప్రారంభం కానుంది

భారత్ - ఇంగ్లండ్ తొలి టీ 20 మ్యాచ్ నేడు ప్రారంభం కానుంది. కోల్ కత్తా వేదికగా ఈ మ్యాచ్ రాత్రి ఏడు గంటలకు ప్రారంభం కానుంది. సొంత మైదానంలో జరుగుతున్న ఈ మ్యాచ్ లో టీం ఇండియా హాట్ ఫేవరెట్ గా నిలుస్తుందని క్రీడా విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఇటీవల సొంత గడ్డపైన న్యూజిల్యాండ్ తోనూ, ఆస్ట్రేలియా లో ఆ టీం మీద వరస ఓటములను చవిచూసిన సీనియర్లు ఎక్కువగా ఉన్న జట్టుకు గెలుపు రుచి చూపించాల్సిన బాధ్యత యువ క్రికెటర్ల మీద ఉంది. భవిష్యత్ మీదే. బీసీసీఐ ఎన్నిరాజకీయాలు చేసినా యువ ఆటగాళ్ల ను ఎవరూ ఆపలేరు. సీనియర్లను తరిమేయాలంటే ఇలాంటి సిరీస్ ను సొంత గడ్డపై సొంతం చేసుకుని తమ చేవను నిరూపించుకోవాల్సిన బాధ్యత కుర్రోళ్లపై ఉంది.
యువకులతో...
ఈ మ్యాచ్ కు సూర్యకుమార్ యాదవ్ కెప్టెన్ గా ఉన్నారు. టీ 20 అంటే కుర్రోళ్లతో నిండిపోయింది. వీరికి వన్డేలు, టెస్ట్ మ్యాచ్ లలో సీనియర్లు జట్టులో ఉన్నంత కాలం అవకాశాలు దక్కవు. వచ్చిన అవకాశాన్ని అందిపుచ్చుకోవడంతో పాటు తమ మెరుపు షాట్లతో క్రికెట్ ను ఓ రేంజ్ కు తీసుకెళ్లగలిగేది యువజట్టు మాత్రమేనని నిరూపించుకోగలగాలి. అప్పటికైనా సెలక్షన్ కమిటీ కొంత రియలైజ్ అయ్యే అవకాశాలున్నాయి. వైఎస్ కెప్టెన్ గా అక్షర్ పటేల్ ఉంటున్నారు. సంజు శాంసన్,అభిషేక్ శర్మ, తిలక్ వర్మ, రింకూ సింగ్, హార్ధిక్ పాండ్యా, అర్హదీప్ సింగ్, రవి బిష్ణోయ్, వరుణ్ చక్రవర్తి వంటి వారికి ఈ మ్యాచ్ లో అవకాశం దక్కేందుకు ఎక్కువగా ఛాన్స్ కనపడుతుంది.
ఎదురులేని జట్టుగా...
అదే సమయంలో టీ 20 అంటే టీం ఇండియాకు ఎదురులేదన్నది నిరూపించుకోగలగాలి. సీనియర్లు, యువకులతో నిండిపోయిన మన జట్టు ప్రపంచంలో కెల్లా అత్యంత స్ట్రాంగ్ అయిన జట్టుగా పేరుంది. బ్యాట్ తో బాదుడు బాదే యువ జట్టుతో టీం కళకళలాడిపోతుంది. ఒకరు అవుటయినా మరొకరు ఉన్నారులేనన్న ధైర్యం జట్టుకు మరింత శోభను తెస్తుంది. అదేకదా క్రికెట్ ఫ్యాన్స్ కు కావాల్సింది. అందుకే ఈ సిరీస్ ను సొంతం చేసుకోవాలంటే తొలి మ్యాచ్ నుంచే విజయాలను సొంతం చేసుకోగలగాలి. అందుకే నేడు కోల్ కత్తాలో జరిగే టీ 20 మ్యాచ్ పట్ల క్రికెట్ అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఇంగ్లండ్ జట్టును తక్కువగా అంచనా వేయకుండా బాగా ఆడి సీనియర్ ఆటగాళ్లు సిగ్గుపడేలా జట్టును విజయపథాన నడిపించాలని కోరుకుందాం.. ఆల్ ది బెస్ట్ టీం ఇండియా.
Next Story