Wed Dec 25 2024 09:25:53 GMT+0000 (Coordinated Universal Time)
India vs Zimbabwe T20 : నేడు తొలి టీ 20 మ్యాచ్
నేడు భారత్ - జింబాబ్వే మధ్య తొలి టీ20 మ్యాచ్ జరగనుంది.
నేడు భారత్ - జింబాబ్వే మధ్య తొలి టీ20 మ్యాచ్ జరగనుంది. జింబాబ్వేతో ఐదు మ్యాచ్ ల సిరీస్ లో భాగంగా నేడు ఫస్ట్ మ్యాచ్ జరగనుంది. మ్యాచ్ సాయంత్రం 4.30 గంటలకు ప్రారంభం కానుంది. ఇప్పటికే జింబాబ్వేకు చేరుకున్న భారత్ జట్టు ప్రాక్టీస్ ముమ్మరంగా చేసింది. ఐదు మ్యాచ్ ల సిరీస్ ను కైవసం చేసుకోవాలని ఇరు జట్లు భావిస్తున్నారు. తీవ్రంగా శ్రమిస్తున్నాయి.
గిల్ నాయకత్వంలో...
భారత్ శుభమన్ గిల్ నాయకత్వంలో యువ జట్టు ఈ మ్యాచ్ లో ఆడుతుంది. సీనియర్ ఆటగాళ్లకు విశ్రాంతి ఇచ్చి ఐపీఎల్ లో సత్తా చాటిన వారికి అవకాశం కల్పించారు. దీంతో యువ ఆటగాళ్లు తమ సత్తా చూపేందుకు రెడీ అయిపోయారు. రెండు జట్లు విజయం కోసం తీవ్రంగా ప్రయత్నిస్తున్నాయి. గెలుపు కోసం శ్రమిస్తున్నాయి.
Next Story