Mon Dec 23 2024 10:57:10 GMT+0000 (Coordinated Universal Time)
పంత్ కనిపిస్తే చెంప చెళ్లుమనిపిస్తా
రిషబ్ పంత్ పై మాజీ క్రికెటర్ కపిల్ దేవ్ షాకింగ్ కామెంట్స్ చేశారు.
రిషబ్ పంత్ పై మాజీ క్రికెటర్ కపిల్ దేవ్ షాకింగ్ కామెంట్స్ చేశారు. పంత్ నిర్లక్ష్యంగా డ్రైవ్ చేసి భారత్ క్రికెట్ ను ఏడాది పాటు అగమ్యగోచరంలోకి నెట్టేశారన్నారు. పంత్ నిర్లక్ష్యంగా కారు నడపటం వల్లనే ఈ ప్రమాదం జరిగిందన్నారు. ప్రాణాలతో చెలగాటమెందుకని కపిల్ దేవ్ ప్రశ్నించారు.
టీం ఇండియాకు...
టెస్ట్ లలో పంత్ అవసరం ఎంతో ఉందన్నారు. పంత్ టెస్ట్ల్లో రెగ్యులర్ సభ్యుడని అన్నారు. ఈ ఏడాది బోర్డర్ - గవాస్కర్ ట్రోఫీ, వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ షిప్ ఫైనల్స్ ఉన్నాయన్న స్పృహ లేకుండానేే కారును నడిపి ప్రమాదానికి గురయ్యాడని కపిల్ దేవ్ అభిప్రాయపడ్డరాు. టీమిండియాను పంత్ దారుణంగా దెబ్బతీశాడంటున్నారు. కాగా ముంబయిలోని ఆసుపత్రిలో రిషబ్ పంత్ క్రమంగా కోలుకుంటున్నారు.
Next Story