Mon Dec 23 2024 13:13:23 GMT+0000 (Coordinated Universal Time)
India Vs Asutralia T20 : టాస్ గెలిచిన ఆసీస్.. ఫస్ట్ ఇండియా బ్యాటింగ్
ఇండియా - ఆస్ట్రేలియా మధ్య నాలుగో టీ20 మ్యాచ్ మరికాసేపట్లో ప్రారంభం కానుంది
ఇండియా - ఆస్ట్రేలియా మధ్య నాలుగో టీ20 మ్యాచ్ మరికాసేపట్లో ప్రారంభం కానుంది. టాస్ గెలిచిన ఆస్ట్రేలియా ఫీల్డింగ్ ఎంచుకుంది. తొలుత ఇండియా బ్యాటింగ్ చేయనుంది. రెండు జట్లకు ఈ మ్యాచ్ కీలకం కావడంతో అభిమానులు ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు. రాయపూర్ వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్ లో ఇండియా గెలిస్తే సిరీస్ ఒక మ్యాచ్ కు ముందుగానే సిరీస్ ను సొంతం చేసుకునే వీలుంది. అలాగే ఆస్ట్రేలియా ఈ మ్యాచ్ లో గెలిస్తే రెండు జట్ల మధ్య బలం సమానంగా ఉండి ఐదో మ్యాచ్ లో సిరీస్ ఎవరిదన్నది తేల్చనుంది.
రెండు జట్లు బలంగానే....
అందుకే రెండు జట్లు ఈ మ్యాచ్ లో విజయం సాధించేందుకు శ్రమిస్తున్నాయి. భారత్ జట్టు స్వల్ప మార్పులతో ఈ మ్యాచ్ లోకి దిగనుంది. తిలక్ వర్మ స్థానంలో శ్రేయస్ అయ్యర్ రానున్నారని తెలిసింది. అలాగే ప్రసిద్ధ్ కృష్ణ స్థానంలో ముఖేశ్ కుమార్ గాని, దీపక్ చాహర్ గానీ తీసుకునే అవకాశముంది. ఆస్ట్రేలియా కూడా కొత్త సభ్యులతో బరిలోకి దిగుతుంది. సీనియర్లంతా రెస్ట్ కోసం ఆస్ట్రేలియా తరలి వెళ్లడంతో ఉన్న సభ్యులతోనే రెండు టీ 20 మ్యాచ్ లను ఆడేందుకు సిద్ధమవుతుంది. అయితే రెండు జట్లు బలంగానే కనిపిస్తున్నాయి.
Next Story