Mon Dec 23 2024 02:27:46 GMT+0000 (Coordinated Universal Time)
India Vs England : నేడు ఇండియా - ఇంగ్లండ్ నాలుగో టెస్ట్.. సిరీస్ ఫలితం తేల్చనుందా?
నేటి నుంచి భారత్ - ఇంగ్లండ్ మధ్య నాలుగో టెస్ట్ మ్యాచ్ జరగనుంది. రాంచీ వేదికగా ఈ మ్యాచ్ ప్రారంభం కానుంది
నేటి నుంచి భారత్ - ఇంగ్లండ్ మధ్య నాలుగో టెస్ట్ మ్యాచ్ జరగనుంది. రాంచీ వేదికగా ఈ మ్యాచ్ ప్రారంభం కానుంది. ఐదు మ్యాచ్‌ల సిరీస్ లో భారత్ 2 -1 ఆధిక్యంలో కొనసాగుతుంది. ఈ మ్యాచ్ లో గెలిస్తే భారత్ టెస్ట్ సిరీస్ ను సొంతం చేసుకున్నట్లే. ఓటమి పాలయితే ఐదో మ్యాచ్ సిరీస్ ఎవరి సొంతమో ఐదో మ్యాచ్ తేల్చనుంది. డ్రాగా ముగిసినా ఫలితంపై సస్పెన్స్ వీడదు. ఇప్పటికే భారత్ విశాఖ, రాజ్‌కోట్‌లో బ్యాక్ టు బ్యాక్ మ్యాచ్ లలో విజయం సాధించింది. హైదరాబాద్‌లో జరిగిన మ్యాచ్ లో ఇంగ్లండ్ విజయం సాధించింది.
కసితో భారత్...
ఈ మ్యాచ్ గెలిచి సిరీస్ ను సొంతం చేసుకోవాలని భారత్ కసితో ఉంది. అలాగే ఈ మ్యాచ్‌లో గెలిచి సిరీస్ ను సమం చేసుకోవాలని ఇంగ్లండ్ భావిస్తుంది. ఇంగ్లండ్ ఈ మ్యాచ్ గెలిచి సిరీస్ ను నిలబెట్టుకోవాలని పరితపిస్తుంది. రాంచీలో నేడు జరిగే మ్యాచ్ కు భారత్ కొన్ని మార్పులతో బరిలోకి దిగనుంది. మహ్మద్ సిరాజ్ స్థానంలో ఆకాష్ దీప్ ను దించే అవకాశం ఉంది. రజత్ పటేదార్ కూడా మరో ఛాన్స్ ఇచ్చేందుకు కూడా అవకాశం లేకపోలేదు. మొత్తం మీద ఇంగ్లండ్ కు ఈ మ్యాచ్ చావో రేవో కాగా, భారత్ మాత్రం గెలిచి సిరీస్ ను సొంతం చేసుకోవాలనుకుంటుంది.
Next Story