Sat Dec 21 2024 13:18:25 GMT+0000 (Coordinated Universal Time)
French Open Badminton: ఫ్రెంచ్ ఓపెన్ టైటిల్ నెగ్గిన సాత్విక్-చిరాగ్
ఆదివారం జరిగిన ఫ్రెంచ్ ఓపెన్ పురుషుల డబుల్స్ బ్యాడ్మింటన్ ఫైనల్ లో సాత్విక్ సాయిరాజ్ రంకిరెడ్డి, చిరాగ్ శెట్టి జోడీ
ఆదివారం జరిగిన ఫ్రెంచ్ ఓపెన్ పురుషుల డబుల్స్ బ్యాడ్మింటన్ ఫైనల్ లో సాత్విక్ సాయిరాజ్ రంకిరెడ్డి, చిరాగ్ శెట్టి జోడీ అద్భుత ప్రదర్శన చేసి టైటిల్ ను సొంతం చేసుకుంది. ఈ టైటిల్‌ను సాత్విక్ సాయిరాజ్ రంకిరెడ్డి, చిరాగ్ శెట్టి జోడీ కైవసం చేసుకోవడం రెండోసారి. భారత టాప్ సీడ్ ఫైనల్లో చైనీస్ తైపీకి చెందిన లీ జే-హువే, యాంగ్ పో-హ్సువాన్లపై వరుస గేమ్‌లలో విజయాన్ని నమోదు చేసింది. 2022లో కూడా టైటిల్‌ను గెలుచుకున్న సాత్విక్-చిరాగ్ ఆదివారం 21-11, 21-17 తేడాతో ఫైనల్ లో సత్తా చాటారు. తొలి గేమ్‌లో దూసుకు వెళ్లిన వీరిద్దరూ.. వీరిద్దరూ రెండో గేమ్‌లో మాత్రం గట్టిపోటీని ఎదుర్కొన్నారు. అయితే రెండో గేమ్‌లో భారత జోడీ విజయం సాధించింది. సాత్విక్- చిరాగ్ శక్తివంతమైన స్మాష్‌లతో ఈ టోర్నమెంట్ లో మెరుపు దాడులతో అలరించారు. ఫైనల్ లో కూడా అదే రిపీట్ అయింది.
ఇదే టోర్నీలో శుక్రవారం జరిగిన మహిళల సింగిల్స్ క్వార్టర్స్‌లో చైనాకు చెందిన చెన్ యు ఫీ చేతిలో ఓటమి పాలైంది. క్వార్టర్స్‌లో అద్భుతమైన పోరాట పటిమ చూపించిన సింధు.. 24-22,17-21, 18-21తో ఓటమి పాలైంది. ఇక మిగిలిన ఆశలన్నీ భారత అభిమానులు సాత్విక్-చిరాగ్ మీద పెట్టుకోగా.. వారు టైటిల్ నెగ్గారు.
Next Story