Sun Dec 22 2024 10:19:56 GMT+0000 (Coordinated Universal Time)
సరికొత్త చరిత్ర.. 10 కి పది వికెట్లు తీసిన అన్షుల్ కాంబోజ్
ఫాస్ట్ బౌలర్ అన్షుల్ కాంబోజ్ సరికొత్త చరిత్ర సృష్టించాడు
ఫాస్ట్ బౌలర్ అన్షుల్ కాంబోజ్ సరికొత్త చరిత్ర సృష్టించాడు. 39 ఏళ్లలో ఒక ఇన్నింగ్స్‌లో మొత్తం 10 వికెట్లు తీసిన తొలి బౌలర్‌గా రంజీ ట్రోఫీ చరిత్రలో తన పేరును లిఖించుకున్నాడు. శుక్రవారం లాహ్లీలోని చౌదరి బన్సీ లాల్ క్రికెట్ స్టేడియంలో హర్యానా-కేరళ జట్ల మధ్య జరిగిన మ్యాచ్‌లో ఈ అద్భుతమైన ఫీట్ సాధించాడు.
టోర్నమెంట్ చరిత్రలో ఈ అరుదైన మైలురాయిని సాధించిన మూడో బౌలర్ కాంబోజ్. 23 ఏళ్ల అన్షుల్ కేరళ బ్యాటింగ్ లైనప్‌ను చీల్చిచెండాడాడు. 49 పరుగులకే 10 వికెట్లు తీసి సంచలనాత్మక స్పెల్‌ను అందించాడు. అతడి బౌలింగ్ కారణంగా కేరళ మొదటి ఇన్నింగ్స్‌లో 291 పరుగులకు పరిమితం అయింది.
కాంబోజ్ కంటే ముందు 1956-57లో అస్సాంపై బెంగాల్‌కు చెందిన ప్రేమంగ్సు ఛటర్జీ (10/20), 1985-86లో విదర్భపై రాజస్థాన్‌కు చెందిన ప్రదీప్ సుందరం (10/78) రంజీ ట్రోఫీలో ఈ అద్భుతమైన మైలురాయిని సాధించారు.
రంజీ ట్రోఫీ చరిత్రలో అత్యుత్తమ బౌలింగ్ గణాంకాలు:
10/20 – ప్రేమాంగ్షు ఛటర్జీ – బెంగాల్ v అస్సాం (1956-57)
10/49 – అన్షుల్ కాంబోజ్ – హర్యానా v కేరళ (2024-25)
10/78 – ప్రదీప్ సుందరం – రాజస్థాన్ v విదర్భ (1985-86)
ఫస్ట్ క్లాస్ క్రికెట్లో 10 వికెట్లు తీసిన భారత బౌలర్లు:
10/20 – ప్రేమంగ్షు ఛటర్జీ – బెంగాల్ v అస్సాం (1956-57) - రంజీ ట్రోఫీ
10/46 – దేబాసిస్ మొహంతి – ఈస్ట్ జోన్ v సౌత్ జోన్ (2000-01) - దులీప్ ట్రోఫీ
10/49 – అన్షుల్ కాంబోజ్ – హర్యానా v కేరళ (2024-25) 10/74
10-74 - అనిల్ కుంబ్లే – ఇండియా v పాకిస్తాన్ (1999) -- కోట్లా -- టెస్ట్ మ్యాచ్
10/78 – ప్రదీప్ సుందరం – రాజస్థాన్ v విదర్భ (1985-86) - రంజీ ట్రోఫీ
10/78 – సుభాష్ గుప్తే – బొంబాయి v పాకిస్తాన్ కంబైన్డ్ సర్వీసెస్, బహవల్పూర్ XI (1954-55).
Next Story