Mon Dec 23 2024 23:29:29 GMT+0000 (Coordinated Universal Time)
మ్యాచ్ టిక్కెట్లన్నీ అయిపోయాయ్.. అజారుద్దీన్
మ్యాచ్ టిక్కెట్లు అయిపోయాయని హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ ఛైర్మన్ అజారుద్దీన్ తెలిపారు.
జింఖానా గ్రౌండ్స్ లో టిక్కెట్ల విక్రయం ముగిసింది. తొక్కిసలాట జరగడంతో టక్కెట్ విక్రయం పూర్తిగా నిలిపేశారు. ఇక మ్యాచ్ టిక్కెట్లు అయిపోయాయని హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షుడు అజారుద్దీన్ తెలిపారు. తమ వైపు ఎలాంటి తప్పు జరగలేదని అన్నారు. ఇలాంటి పెద్దమ్యాచ్ లు జరుగుతున్నప్పుడు చిన్నా చితకా సంఘటనలు జరుగుతుంటాయని అజారుద్దీన్ అన్నారు.
నిర్వహణ చాలా కష్టం...
మ్యాచ్ టిక్కెట్లు అయిపోయాయని హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ ఛైర్మన్ అజారుద్దీన్ తెలిపారు. తాను వెళ్లి మ్యాచ్ నిర్వహణ చూసుకోవాలని ఆయన తెలిపారు. ఇవన్నీ చూసుకోవాల్సింది తాను కాదని ఆయన చెప్పారు. తనపై మ్యాచ్ నిర్వహణ బాధ్యత ఉందని ఆయన చెప్పారు. టిక్కెట్ల అమ్మకాలపై ఏం జరిగిందన్నది నివేదిక అందిస్తామని చెప్పారు. లోపాలను సవరించుకుంటామని తెలిపారు. మ్యాచ్ నిర్వహణ చాలా అంశాలతో కూడుకున్నదని ఆయన అన్నారు. కూర్చుని మాట్లాడుకున్నంత సులువు కాదని అజారుద్దీన్ తెలిపారు మ్యాచ్ నిర్వహణను నెగిటివ్ కోణంలో చూడవద్దని ఆయన అన్నారు.
Next Story