Mon Dec 23 2024 09:52:33 GMT+0000 (Coordinated Universal Time)
Breaking : హైదరాబాద్ మహిళ క్రికెట్ హెడ్ కోచ్ పై వేటు.. మద్యం తాగి మహిళ క్రికెటర్లను
హైదరాబాద్ మహిళ క్రికెట్ హెడ్ కోచ్ పై వేటు పడింది. కోచ్ జయసింహను సస్పెండ్ చేస్తూ అధికారులు ఉత్తర్వులు జారీ చేశారు
హైదరాబాద్ మహిళ క్రికెట్ హెడ్ కోచ్ పై వేటు పడింది. క్రికెట్ హెడ్ కోచ్ జయసింహను సస్పెండ్ చేస్తూ అధికారులు ఉత్తర్వులు జారీ చేశారు. మహిళ క్రికెటర్లపై లైంగిక వేధింపులకు పాల్పడుతున్నారంటూ జయసింహపై ఆరోపణలు వచ్చాయి. మద్యం తాగి మహిళ క్రికెటర్లను దూషించడమే కాకుండా వారిని వేధిస్తుండటంతో ఆయనను సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.
మద్యం తాగుతూ...
బస్సులో మద్యం తాగుతూ జయసింహ మహిళ క్రికెటర్లను వేధిస్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. దీనికి సంబంధించి హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ తక్షణమే స్పందించింది. వెంటనే ఆయనను సస్పెండ్ చేస్తున్నట్లు ప్రకటించింది. బస్సులో మద్యం తాగిన ఘటనపై కూడా విచారణకు ఆదేశించినట్లు హెచ్సీఏ అధికారులు తెలిపారు.
Next Story