Fri Nov 22 2024 08:17:24 GMT+0000 (Coordinated Universal Time)
బౌలింగ్ అంటే ఇదే కదా?
హైదరాబాదీ ఆటగాడు మహ్మద్ సిరాజ్ శ్రీలంక బ్యాటర్లను గడగడలాడిస్తున్నాడు. ఆరు వికెట్లు తీసి శ్రీలంకను చావు దెబ్బ తీశాడు
హైదరాబాదీ ఆటగాడు మహ్మద్ సిరాజ్ శ్రీలంక బ్యాటర్లను గడగడలాడిస్తున్నాడు. ఆరు వికెట్లు తీసి ఆసియా కప్ లో శ్రీలంకను చావు దెబ్బ తీశాడు. ఆరు వికెట్లు తీయడం అంటే ఆషామాషీ కాదు. సిరాజ్ బౌలింగ్ లో శ్రీలంక ఆటగాళ్లు చేతులెత్తేశారు. క్లీన్ బౌల్డ్ యని కొందరు, క్యాచ్ ఇచ్చి మరికొందరు వరసగా లంకేయులు వెనుదిరిగి వెళ్లారు. ఆసియా కప్ లో జరగాల్సిన ఘటన కాదు కానీ నలభై పరుగులకే శ్రీలంక ఎనిమిది వికెట్లు కోల్పోయిదంటే ఇక ఆటలో ఏం మజా ఉంటుంది? ఒకే ఓవర్ లో నాలుగు వికెట్లు తీసి అరుదైన ఘనతను సాధించాడు.
ఆరు వికెట్లు...
ఇందులో హైదరాబాదీ ఆటగాడు సిరాజ్ను ఘనతను చెప్పుకోకుండా ఉండలేం. వరసగా వికెట్లు తీస్తుండటంతో కెప్టెన్ రోహిత శర్మ సిరాజ్ కు వరసగా బౌలింగ్ అవకాశమిస్తున్నాడు. ఆరు ఓవర్లు చేసిన మహ్మద్ సిరాజ్ ఆరు వికెట్లు తీశాడు. బహుశ ఇది ప్రపంచ చరిత్రలోనే అరుదైన రికార్డు అయి ఉంటుంది. శ్రీలంక తన సొంత మైదానంలో సిరాజ్ దెబ్బకు చేతులెత్తేసింది. సండే అంటే సిరాజ్ అంటూ మైదానంలో భారత్ అభిమానులు నినాదాలు చేస్తుండటం వినిపించింది. ఆరు వికెట్లు తీసిన సిరాజ్ ఇప్పటి వరకూ ఏడు ఓవర్లు చేశారు. 21 పరుగులు ఇచ్చాడు.
Next Story