Tue Apr 01 2025 07:55:32 GMT+0000 (Coordinated Universal Time)
హైదరాబాద్ లో ఉత్కంఠభరితంగా ఆరంభమైన CRYA క్రికెట్ ప్రీమియర్ లీగ్- 2025
హైదరాబాద్ శివార్లలో విస్తరిస్తున్న క్రికెట్ సంస్కృతితో

డిజిటల్ రంగం ఆధిపత్యం చెలాయిస్తున్న యుగంలో క్యాథలిక్ రెడ్డి యూత్ అసోసియేషన్ (CRYA) క్రికెట్‌పై ప్రత్యేక దృష్టి సారించింది. క్రీడల ద్వారా శారీరక దృఢత్వాన్ని పెంపొందించేలా CRYA క్రికెట్ ప్రీమియర్ లీగ్- 2025 హైదరాబాద్‌లో ఫిబ్రవరి 15, 2025న ప్రారంభమైంది. యువతలో స్ఫూర్తిని నింపుతూ అందరినీ ఒకచోట చేర్చే టోర్నమెంట్ ఇది.
ఇప్పటికే 50 మ్యాచ్‌లకు గాను 10 మ్యాచ్‌లు పూర్తి అయ్యాయి. పోటీ మరింత ఎక్కువ అవుతూ ఉండడంతో రాబోయే వారాంతాల్లో జట్లు సన్నద్ధమవుతూ ఉన్నాయి. మొదటి వారం తర్వాత పాయింట్ల పట్టికలో JMJ వారియర్స్, హోలీ హిట్టర్స్, బ్లెస్డ్ ఛాలెంజర్స్, ధాత్రి డ్రాగన్స్ మొదటి నాలుగు స్థానాల్లో నిలిచాయి.
ధాత్రి డ్రాగన్స్ జట్టుకు చెందిన ఆంథోనీ రెడ్డి అల్లం, రేయోలినా ఛాంపియన్స్ నుండి ఏబీడీ క్రాంజ్, హోలీ హిట్టర్స్ నుండి ఎ.రాహుల్ రెడ్డి, బ్లెస్డ్ ఛాలెంజర్స్ నుండి థనుష్, ఎలైవ్ 8 ఎడ్జ్ నుండి సాథ్విక్ సింగారెడ్డి ఈ వారం అత్యుత్తమ ప్రదర్శనకారులలో ఉన్నారు. బౌలింగ్‌లో ఏబీస్ ప్రిడేటర్స్ నుంచి వినోద్ రెడ్డి, హోలీ హిట్టర్స్ నుంచి కార్తీక్ రెడ్డి, జేఎంజే వారియర్స్ నుంచి బాసాని శశికాంత్ రెడ్డి, జేఎంజే వారియర్స్ నుంచి అనీష్ బోయపాటి, జేఎంజే వారియర్స్ నుంచి గాదె అన్వేష్ రెడ్డి ముందున్నారు.

నిర్వాహకులు అల్లం నితిన్ రెడ్డి హైదరాబాద్ మెయిల్‌తో మాట్లాడుతూ, మొదటి వారం విజయవంతం అయినందుకు టోర్నమెంట్ లో భాగమైన అందరికీ కృతజ్ఞతలు తెలిపారు. యువక్రికెటర్లు అద్భుతమైన ప్రదర్శన చేశారని అన్నారు. 16 ఏళ్ల థనుష్ (బ్లెస్డ్ ఛాలెంజర్స్), రానా (బ్లెస్డ్ ఛాలెంజర్స్), 17; గాదె అన్వేష్ (జేఎంజే), 17, అనీష్ (JMJ) లు రాణించడం చాలా ఆనందంగా ఉందని నితిన్ అన్నారు.
టోర్నమెంట్ సజావుగా సాగేందుకు స్పాన్సర్షిప్ లు కూడా దక్కాయి. డిజైన్‌వాల్స్ వ్యవస్థాపకుడు, మేనేజింగ్ డైరెక్టర్ అభినవ్ శౌరెడ్డి టోర్నమెంట్ కు బంతులు, నగదు బహుమతులను స్పాన్సర్ చేస్తున్నారు. హైదరాబాద్ మెయిల్ న్యూస్ హబ్ "మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్" అవార్డులకు మద్దతు ఇస్తుంది. మైదానాలు, అంపైర్లు, లైవ్ స్ట్రీమింగ్, వైద్య సేవలు, అవార్డులు, ఇతర ఖర్చులతో సహా టోర్నమెంట్ నిర్వహణకు అయ్యే మొత్తం అంచనా వ్యయం 6,63,000 రూపాయలు. రన్నరప్ గా నిలిచే జట్టుకు గుర్రం సందీప్ ముప్పై వేల రూపాయలను స్పాన్సర్ చేశారు.
డిజైన్‌వాల్స్ వ్యవస్థాపకుడు, మేనేజింగ్ డైరెక్టర్ అభినవ్ శౌరెడ్డి మాట్లాడుతూ, "ఈ చొరవ ద్వారా యువ ప్రతిభకు మద్దతు ఇవ్వడానికి మేము సంతోషిస్తున్నాము. టోర్నమెంట్ బంతులు, నగదు బహుమతులను స్పాన్సర్ చేయడం అనేది క్రీడల వృద్ధికి దోహదపడడమే కాకుండా తరువాతి తరం ఆటగాళ్లను ప్రోత్సహించే మా మార్గం." అని తెలిపారు.

CRYA క్రికెట్ ప్రీమియర్ లీగ్ 2025 హైదరాబాద్ యువతలో క్రీడపై పెరుగుతున్న ఆసక్తిని చూపుతుంది. జనవరి 9, 2025న మొయినాబాద్‌లోని గోలమారి ఫామ్స్‌లో జరిగిన లీగ్ వేలం విశేష దృష్టిని ఆకర్షించింది. ప్లేయర్ బిడ్లు కూడా జరిగాయి. అత్యధికంగా ₹25,000, అత్యల్పంగా ₹2,000 పలికారు.
ఈ టోర్నమెంట్లో 10 జట్లు పాల్గొన్నాయి. ఒక్కొక్క జట్టుకు ఒక యజమాని, కెప్టెన్ ఉన్నారు:

క్రికెట్ ద్వారా ఐక్యతను పెంపొందించేందుకు అసోసియేషన్ ఎంతో నిబద్ధతను చూపిస్తోందని నితిన్ రెడ్డి తెలిపారు. "మేము ప్రజలను ఒకచోట చేర్చి శాశ్వత కనెక్షన్లను సృష్టించాలనుకుంటున్నాము. ఈ టోర్నమెంట్ కేవలం ఆట కోసం మాత్రమే కాదు.. అంతకంటే ఎక్కువ; ఇది సమాజ స్ఫూర్తిని పెంపొందిస్తుంది ”అని చెప్పారు.

హైదరాబాద్ శివార్లలో విస్తరిస్తున్న క్రికెట్ సంస్కృతితో పాటు పెరుగుతున్న డిమాండ్‌కు అనుగుణంగా మరిన్ని మైదానాలను నిర్మిస్తున్నారు. నగరంలోని యువత క్రీడలో నిమగ్నమయ్యే అవకాశాలను ఎక్కువగా వెతుకుతున్నారు. CRYA క్రికెట్ ప్రీమియర్ లీగ్ వంటి కార్యక్రమాలు తర్వాతి తరం క్రికెట్ ఔత్సాహికులను రూపొందించడంలో సహాయపడుతున్నాయి.


Next Story