Mon Dec 23 2024 05:36:29 GMT+0000 (Coordinated Universal Time)
ఐసీసీ ర్యాంకింగ్స్: 2019 తర్వాత ఇదే తొలిసారి
ఐసీసీ వన్డే ర్యాంకుల్లో మరో భారత బ్యాట్స్మెన్ సత్తా చాటాడు
ఐసీసీ వన్డే ర్యాంకుల్లో మరో భారత బ్యాట్స్మెన్ సత్తా చాటాడు. శుభ్మన్ గిల్ కెరీర్ బెస్ట్ ర్యాంక్ సాధించాడు. పాకిస్థాన్ కెప్టెన్ బాబర్ ఆజం నంబర్ వన్ ర్యాంకుకు దగ్గరవుతూ ఉన్నాడు గిల్. టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ, మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లి తాజా ర్యాంకుల్లో టాప్ 10లోకి రావడం విశేషం. 2019 తర్వాత టాప్ 10లో ముగ్గురు ఇండియన్ బ్యాటర్లు ఉండటం ఇదే తొలిసారి. పాకిస్థాన్ తో జరిగిన సూపర్ 4 మ్యాచ్ లో గిల్ హాఫ్ సెంచరీ చేయడంతో అతడు ఐసీసీ ర్యాంకింగ్స్ లో మూడు నుంచి రెండో స్థానానికి చేరుకున్నాడు. బాబర్ ఆజం నంబర్ వన్ గా కొనసాగుతున్నాడు.
మంచి ఫామ్ లో ఉన్న గిల్.. ఈ ఏడాది 1000 పరుగులకు చేరువలో ఉన్నాడు. ప్రస్తుతం 16 మ్యాచ్ లలో 64.51 సగటుతో 904 పరుగులు చేశాడు. ఇక కెప్టెన్ రోహిత్ శర్మ 8వ స్థానంలో , విరాట్ కోహ్లి 9వ ర్యాంకులో ఉన్నారు. ఈ ఇద్దరూ రెండేసి స్థానాలు పైకి ఎగబాకారు. రోహిత్ నేపాల్, పాకిస్థాన్ తోపాటు శ్రీలంకపైనా హాఫ్ సెంచరీలు చేశాడు. విరాట్ కోహ్లి శ్రీలంకపై విఫలమైనా.. పాకిస్థాన్ తో మ్యాచ్ లో సెంచరీ చేశాడు. ఆ మ్యాచ్ లో 94 బంతుల్లోనే 122 రన్స్ చేసిన విరాట్, వన్డేల్లో 47వ సెంచరీ నమోదు చేశాడు. ఆసియా కప్ సూపర్-4 లో భారత్ అద్భుతంగా రాణించింది. ఆసియా కప్ ఫైనల్ కు చేరుకుంది. ఈ టోర్నమెంట్ ముగిసిన తర్వాత భారత్ ప్రపంచ కప్ కోసం పోరాడనుంది. భారత్ లో నిర్వహించనున్న ఈ టోర్నమెంట్ లో భారత్ టైటిల్ ను ముద్దాడుతుందని అభిమానులు ఎంతో నమ్మకంతో ఉన్నారు.
Next Story