Fri Dec 20 2024 20:28:57 GMT+0000 (Coordinated Universal Time)
పాక్ ఫైనల్ కు వెళుతుందా?
టీ 20 వరల్డ్ కప్ లో ఈరోజు ముఖ్యమైన సెమీ ఫైనల్స్ జరుగుతుంది. పాకిస్థాన్ - న్యూజిలాండ్ జట్ల మధ్య సెమీస్ నేడు జరగనుంది.
టీ 20 వరల్డ్ కప్ లో ఈరోజు ముఖ్యమైన సెమీ ఫైనల్స్ జరుగుతుంది. పాకిస్థాన్ - న్యూజిలాండ్ జట్ల మధ్య సెమీస్ నేడు జరగనుంది. టీ 20 వరల్డ్ కప్ లో ఇది కీలక ఘట్టం. ఈ మ్యాచ్ లో విజయం సాధించిన జట్టు ఫైనల్ కు చేరుకుంటుంది. రెండు జట్లు బలంగా ఉన్నాయి. పాకో తొలి మ్యాచ్ లలో తడబడినా తర్వాత పుంజుకుంది. పాకిస్థాన్ సూపర్ 12లో భారత్, జింబాబ్వే చేతిలో ఓటమి పాలయి తిరిగి ఆత్మవిశ్వాసంతో మైదానంలోకి అడుగుపెట్టింది.
న్యూజిలాండ్ జట్టు...
మరో వైపు న్యూజిలాండ్ జట్టు కూడా బలంగా ఉంది. గ్రూప్ 1లో న్యూజిలాండ్ జట్టు టాపర్ గా నిలిచింి. ఆస్ట్రేలియా, శ్రీలంక, ఐర్లాండ్ జట్లపై గెలిచి ఫుల్ జోష్ లో ఉంది. ఇది క్రికెట్. ఏమైనా జరగొచ్చు. వరసగా గెలిచామని ఈ మ్యాచ్ కూడా గెలుస్తామని అనుకోవడానికి వీలులేదు. అందుకే ఈ మ్యాచ్ పై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. అయితే న్యూజిలాండ్ జట్టు ఫామ్ లో ఉండటంతో పాకిస్థాన్ కొంత శ్రమించాల్సి ఉంటుందని క్రీడాపండితులు చెబుతున్నారు. సిడ్నీలో ఈరోజు ఇరు జట్ల మధ్య ఫైనల్ బెర్త్ కోసం పోరు జరగనుంది.
Next Story