Mon Dec 23 2024 06:14:17 GMT+0000 (Coordinated Universal Time)
చెలరేగుతున్న బౌలర్లు.. 4 విక్కెట్లు కోల్పోయిన ఇంగ్లండ్
ఇంగ్లండ్ తో జరుగుతున్న తొలి వన్డేలో భారత్ బౌలర్లు చెలరేగుతున్నారు. 22పరుగులకే ఇంగ్లండ్ నాలుగు వికెట్లను కోల్పోయింది.
ఇంగ్లండ్ తో జరుగుతున్న తొలి వన్డేలో భారత్ బౌలర్లు చెలరేగుతున్నారు. 15 పరుగులకే ఇంగ్లండ్ నాలుగు వికెట్లను కోల్పోయింది. బూమ్రా రెండు వికెట్లు తీశాడు. 1.4 వ ఓవర్ లో బూమ్రా జాసన్ రాయ్ ను డకౌట్ చేశాడు. అదే ఓవర్లో తర్వాత బంతికి క్రీజ్ లోకి వచ్చిన జో రూట్ కూడా డకౌట్ అయ్యారు. తర్వాత షమీ వేసిన బౌలింగ్ లో బెన్ స్టోక్ కూడా డకౌట్ గా నిలిచాడు. ప్రస్తుతం ఇంగ్లండ్ 7 ఓవర్లకు 24 పరుగులు చేసి మూడు వికెట్లు కోల్పోయింది.
మూడు ఓవర్లు. మూడు వికెట్లు...
అనంతరం బూమ్రా వేసిన బౌలింగ్ లో బెయిర్ స్ట్రో అవుటయ్యాడు. బెయిర్ స్టో ఏడు పరుగులు చేసి కీపర్ పంత్ చేతికి క్యాచ్ ఇచ్చి అవుటయ్యాడు. బూమ్రా మూడు ఓవర్లు వేసి మూడు వికెట్లు తీసుకున్నాడు. ప్రస్తుతం లివింగ్ స్టోన్, బట్లర్ క్రీజ్ లో ఉన్నారు. ఇంగ్లండ్ టాప్ ఆర్డర్ కుప్పకూలిపోవడంతో కష్టాల్లో పడినట్లయింది. ఇప్పుడు ఇంగ్లండ్ ఆశలన్నీ బట్లర్ పైనే ఉన్నాయి.
Next Story