Fri Nov 29 2024 03:37:34 GMT+0000 (Coordinated Universal Time)
కుప్పకూలిన ఆసీస్.. తక్కువ పరుగులకే?
భారత్ - ఆస్ట్రేలియా మధ్య తొలి టెస్ట్ లో భారత్ బౌలర్లు విజృంభించారు. 177 పరుగులకే ఆసిస్ ఆల్ అవుట్ అయింది
భారత్ - ఆస్ట్రేలియా మధ్య తొలి టెస్ట్ లో భారత్ బౌలర్లు విజృంభించారు. తక్కువ పరుగులకే ఆసిస్ బ్యాటర్లను పెవిలియన్ బాట పట్టించారు. నాగపూర్ లోని విదర్భం స్టేడియంలో ప్రారంభమైన బోర్డర్ - గవాస్కర్ ట్రోఫీ తొలి టెస్ట్ మ్యాచ్ లో ఆసిస్ బ్యాటర్లు ఆది నుంచి తడబడ్డారు. తొలి ఇన్నింగ్స్ లో ఆస్ట్రేలియా 177 పరుగులకు ఆల్ అవుట్ అయింది. టాస్ గెలిచిన ఆసిస్ తొలుత బ్యాటింగ్ ఎంచుకోవడంతో భారత్ ఫీల్డింగ్ చేయాల్సి వచ్చింది.
జడేజా స్పిన్ మంత్రం...
లంచ్ బ్రేక్ సమయానికి 32 ఓవర్లలో రెండు వికెట్లు కోల్పోయి 76 పరుగులు చేసిన ఆస్టేలియా ఆ తర్వాత 101 పరుగులు చేసి ఆల్ అవుట్ అయింది. భారత్ స్పిన్నర్ల ధాటికి ఆసిస్ బౌలర్లు బ్యాట్లు ఎత్తివేశారు. త్వరత్వరగా పెవిలియన్ కు చేరుకున్నారు. రవీంద్ర జడేజా ఐదు వికెట్లు, అశ్విన్ మూడు, సిరాజ్, షమీకి చెరొక వికెట్లు లభించాయి. చాలా రోజుల తర్వాత మైదానంలోకి దిగిన జడేజా తన చేతికున్న పవర్ ను చూపించారు. తొలి ఇన్నింగ్స్ లో భారత్ ఎంత ఎక్కువ పరుగులు చేయగలిగితే అంత వత్తిడి తగ్గుతుంది.
Next Story