Fri Jan 10 2025 22:57:31 GMT+0000 (Coordinated Universal Time)
T20 : టాస్ గెలిచిన భారత్
భారత్ - ఆస్ట్రేలియా మధ్య మ్యాచ్ లో భారత్ టాస్ గెలిచి ఫీల్డింగ్ ను ఎంచుకుంది
మరికాసేపట్లో హైదరాబాద్ ఉప్పల్ స్టేడియంలో భారత్ - ఆస్ట్రేలియా మధ్య మ్యాచ్ ప్రారంభం కానుంది. ఈ మ్యాచ్ లో భారత్ టాస్ గెలిచి ఫీల్డింగ్ ను ఎంచుకుంది. తొలుత ఆస్ట్రేలియా బ్యాటింగ్ చేయనుంది. ఈ పిచ్ బ్యాటింగ్ కు అనువైన పిచ్ అని క్రీడా విశ్లేషకులు చెబుతున్నారు. 20 ఓవర్లలో రెండు వందలకు పైగా పరుగులు చేసే అవకాశముందని చెబుతున్నారు. ఒకే ఒక్క మార్పుతో భారత్ బరిలోకి దిగుతుంది. రిషబ్ పంత్ స్థానంలో భారత్ జట్టులో భువనేశ్వర్ కుమార్ ను తీసుకున్నారని తెలుస్తోంది.
సిరీస్ ను డిసైడ్ చేసేది ...
మూడో వన్డే కావడం, సిరీస్ ను డిసైడ్ చేసేది కావడంతో ఈ మ్యాచ్ పై ఉత్కంఠ నెలకొంది. ఈ మ్యాచ్ లో ఎవరు గెలిస్తే వారిదే సిరీస్ కావడంతో టాస్ పై కూడా బెట్టింగ్ లు ప్రారంభమయ్యాయి. ఉప్పల్ స్టేడియంలో మ్యాచ్ ను చూసేందుకు వేలాది మంది అభిమానులు తరలి వచ్చారు. రాత్రి 7 గంటలకు మ్యాచ్ ప్రారంభం కానుంది.
Next Story