Tue Nov 05 2024 03:47:06 GMT+0000 (Coordinated Universal Time)
India Vs New Zealand : హమయ్య ఇంకో 55 పరుగులు చేస్తే చాలు గెలిచినట్లే? కానీ చేతిలో ఉన్న వికెట్లు?
భారత్ - న్యూజిలాండ్ మధ్య మూడో టెస్ట్ లో టీం ఇండియా విజయం దిశగా పయనిస్తుంది
భారత్ - న్యూజిలాండ్ మధ్య మూడో టెస్ట్ లో టీం ఇండియా విజయం దిశగా పయనిస్తుంది. టాప్ బ్యాటర్లు విఫలమయినా విక్టరీ కి దగ్గరలో ఉంది. భారత్ మూడో టెస్ట్ ను ముంబయిలో న్యూజిలాండ్ తో తలపడుతుంది. ఇప్పటికే బెంగళూరు, పూణేలలో ఓటమి పాలయిన భారత్ జట్టు మూడో టెస్ట్ లోనైనా గెలిచి విజయం సాధించాలని ప్రతి క్రికెట్ ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. కానీ మళ్లీ ఈ మ్యాచ్ లో కూడా రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీలు నిరాశపర్చారు. ప్రధాన బ్యాటర్లు పెద్దగా పరుగులు చేయకపోయినా చేయాల్సిన పరుగుల లక్ష్యం 147 మాత్రమే కావడంతో కొంత ఇండియాకు ఎడ్జ్ కనపడుతుంది.
స్వల్ప లక్ష్యమేనా?
రెండో ఇన్నింగ్స్ లో భారత్ లక్ష్యం 147 పరుగులుగా ఉంది. అయితే మూడో రోజు లంచ్ బ్రేక్ సమయానికి భారత్ ఆరు వికెట్లు కోల్పోయింది. 92 పరుగులు మాత్రమే చేసింది. ఇంకో 55 పరుగులు చేయగలిగితే భారత్ ఈ మ్యాచ్ లో విజయం సాధించినట్లే. ప్రస్తుతం క్రీజులో రిషబ్ పంత్, వాషింగ్టన్ సుందర్ ఉన్నారు. రిషబ్ పంత్ అర్ధ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. 58 పరుగుల వద్ద ఉన్నాడు. వాషింగ్టన్ సుందర్ ఆరు పరుగుల వద్ద ఉన్నాడు. ఇద్దరూ మంచి బ్యాటర్లే కావడంతో కొంత భారత్ కు అనుకూలమే.
స్పిన్నర్లకు అనుకూలం...
ముంబయి పిచ్ స్పిన్నర్లకు సహకరిస్తుండటం, స్వల్ప లక్ష్యమయినా భారత్ చేతిలో నాలుగు వికెట్లు మాత్రమే ఉండటంతో ఎవరిది గెలుపు అన్నది మాత్రం తేలకుండా ఉంది. ఈ మ్యాచ్ లో ఏదైనా జరిగే అవకాశముంది. అయితే భారత్ కే విజయానికి అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఈ మ్యాచ్ గెలిస్తే వరల్డ్ ఛాంపియన్ షిప్ లో అర్హత సాధించినట్లవుతుంది. అందుకు ఈ మ్యాచ్ గెలుపు భారత్ కు అవసరం. మరోరకంగా న్యూజిలాండ్ పై స్వదేశంపై ఒక మ్యాచ్ అయినా గెలిచినట్లవుతుంది. కానీ మనోళ్లు ఏం చేస్తారన్నది క్రికెట్ ఫ్యాన్స్ కు టెన్షన్ గా ఉంది. చివరకు ఏం జరుగుతుందన్నది మాత్రం చెప్పలేని పరిస్థితి.
Next Story