Sun Dec 14 2025 23:38:07 GMT+0000 (Coordinated Universal Time)
18న హైదరాబాద్ లో క్రికెట్ మ్యాచ్
ఉప్పల్ స్టేడియం మరో ఇంటర్నేషనల్ మ్చాచ్ కు వేదిక కాబోతుంది. ఈ నెల 18న భారత్ - న్యూజిలాండ్ ల మధ్య వన్డే మ్యాచ్ జరుగుతుంది

ఉప్పల్ స్టేడియం మరో ఇంటర్నేషనల్ మ్చాచ్ కు వేదిక కాబోతుంది. ఈ నెల 18న భారత్ - న్యూజిలాండ్ ల మధ్య వన్డే మ్యాచ్ జరుగుతుందని హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ ప్రకటించింది. మధ్యాహ్నం 1.30 గంటలకు ప్రారంభమయ్యే ఈ మ్యాచ్ రాత్రి పది గంటల వరకూ సాగనుంది.
భారత్ - న్యూజిలాండ్ వన్డే మ్యాచ్...
ఈ మ్యాచ్ కు సంబంధించి అన్ని టిక్కెట్లను ఆన్ లైన్ లోనే విక్రయించాలని హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ నిర్ణయించింది. ఆఫ్ లైన్ లో ఎలాంటి టిక్కెట్లను విక్రయించబోమని తెలిపింది. ఇటీవల జరిగిన ఘటనలను దృష్టిలో పెట్టుకుని ఆఫ్ లైన్ టిక్కెట్లను విక్రయించబోమని పేర్కొంది. 13,14,15,16 తేదీల్లో నాలుగు విడతలుగా ఆన్ లైన్ లో టిక్కెట్లను విక్రయించనున్నారు. మొత్తం
29,417 టిక్కెట్లను విక్రయించబోతుంది.
- Tags
- india
- new zealand
Next Story

