Fri Dec 20 2024 16:52:09 GMT+0000 (Coordinated Universal Time)
నేడు న్యూజిలాండ్ తో తలపడనున్న భారత్
టీ20 ప్రపంచ కప్ అసలు టోర్నమెంట్ ప్రారంభానికి ముందు భారత్ నేడు ఆఖరి వార్మప్ మ్యాచ్ ఆడనుంది. న్యూజిలాండ్ తో భారత్ నేడు తలపడనుంది. ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్ లో విజయాన్ని అందుకున్న భారత్.. ఈ మ్యాచ్ లో ఎలా రాణిస్తుందా అని అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తూ ఉన్నారు. భారతజట్టులో ఉన్న సమస్యలను సరిదిద్దుకోవాల్సిన అవసరం ఉంది.
ఐసీసీ టీ20 ప్రపంచకప్‌లో భారత్ తన రెండో వార్మప్ గేమ్‌ను న్యూజిలాండ్‌తో ఆడనుంది. తొలి ప్రాక్టీస్ గేమ్‌లో భారత్ ఆస్ట్రేలియాను ఓడించి జోరుమీదుంది. దక్షిణాఫ్రికాతో జరిగిన తొలి వార్మప్ మ్యాచ్‌లో న్యూజిలాండ్ ఓటమి పాలైంది. కివీస్ కూడా విజయం కోసం ఎదురు చూస్తోంది. బుధవారం (అక్టోబర్ 19) డే-నైట్ గేమ్‌లో న్యూజిలాండ్‌తో భారత్ ఆడనుంది. లైవ్ స్ట్రీమ్ మధ్యాహ్నం 1:30 గంటలకు ప్రారంభమవుతుంది. బ్రిస్బేన్‌లోని గబ్బా వేదికగా ఈ మ్యాచ్ జరగనుంది.
స్క్వాడ్లు:
భారత జట్టు: కేఎల్ రాహుల్, రోహిత్ శర్మ(సి), విరాట్ కోహ్లీ, సూర్యకుమార్ యాదవ్, హార్దిక్ పాండ్యా, దినేష్ కార్తీక్(w), అక్షర్ పటేల్, రవిచంద్రన్ అశ్విన్, హర్షల్ పటేల్, భువనేశ్వర్ కుమార్, మహ్మద్ షమీ, అర్ష్‌దీప్ సింగ్, యుజ్వేంద్ర చాహల్, దీపక్ హుడా , రిషబ్ పంత్
న్యూజిలాండ్ జట్టు: డెవాన్ కాన్వే(w), ఫిన్ అలెన్, మార్టిన్ గప్టిల్, కేన్ విలియమ్సన్(c), గ్లెన్ ఫిలిప్స్, మార్క్ చాప్మన్, మిచెల్ సాంట్నర్, ఆడమ్ మిల్నే, ఇష్ సోధి, లాకీ ఫెర్గూసన్, టిమ్ సౌతీ, డారిల్ మిచెల్, జేమ్స్ నీషమ్, మైఖేల్ బ్రేస్‌వెల్, ట్రెంట్ బౌల్ట్
Next Story