Sat Dec 21 2024 05:00:54 GMT+0000 (Coordinated Universal Time)
హైదరాబాద్ లో మ్యాచ్ ను ఎంతమంది వీక్షించారో తెలుసా..?
మ్యాచ్ సమయంలో మొదటి బాల్ బౌల్ చేసినప్పుడు స్టేడియం లోపల
హైదరాబాదులోని ఉప్పల్ స్టేడియంలో ఉత్కంఠభరితంగా సాగిన చివరి టీ20 మ్యాచ్ లో టీమిండియా జయభేరి మోగించింది. 187 పరుగుల లక్ష్యఛేదనలో 6 వికెట్ల తేడాతో నెగ్గింది. సూర్యకుమార్ యాదవ్ (69), విరాట్ కోహ్లీ (63) టీమిండియా విజయంలో కీలకపాత్ర పోషించారు. ఈ విజయంతో టీమిండియా మూడు టీ20 మ్యాచ్ ల సిరీస్ ను 2-1తో చేజిక్కించుకుంది.
ఇక హైదరాబాద్ లో టికెట్ల కోసం ఎంత గొడవ జరిగిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. జింఖానా గ్రౌండ్స్ వద్ద తొక్కిసలాటలో పలువురు గాయపడ్డారు. టికెట్ల కోసమే ఇంత రచ్చ చోటు చేసుకుంటే.. ఇక మ్యాచ్ సమయంలో ఎలాంటి ఘటనలు చోటు చేసుకుంటాయా అని అందరూ కాస్త టెన్షన్ పడ్డారు. అయితే ప్రశాంతంగానే మ్యాచ్ ముగిసింది. మ్యాచ్ మొత్తం ఎంతో ఉత్కంఠగా సాగింది.. అభిమానుల ఉత్సాహం కూడా అంతే ఎక్కువగా ఉంది.
మ్యాచ్ సమయంలో మొదటి బాల్ బౌల్ చేసినప్పుడు స్టేడియం లోపల 32,459 మంది ఉన్నారు. ఆస్ట్రేలియన్ ఇన్నింగ్స్ పురోగమిస్తున్న కొద్దీ, వారి సంఖ్య 45,004కి చేరుకుంది. రాత్రి 9.30 గంటల ప్రాంతంలో భారత ఇన్నింగ్స్ ప్రారంభం కాగానే, స్టేడియం లోపల 45,354 మంది అభిమానులు ఉన్నారని నిర్వాహకులు ప్రకటించారు. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు లేకుండా మ్యాచ్ను ఆస్వాదించారు, ఆసక్తికరమైన క్రికెట్ మ్యాచ్ ను ఎంజాయ్ చేశారు.
ఆదివారం సాయంత్రం 4 గంటల నుంచి 6 గంటల మధ్య మెట్రో స్టేషన్లు కిక్కిరిసిపోయాయి. మ్యాచ్ పూర్తయ్యాక రాత్రి 11 గంటల నుంచి ఒంటి గంట వరకు కూడా ఇదే పరిస్థితి కనిపించింది. ఉప్పల్, ఎన్జీఆర్ఐ స్టేషన్ల నుంచి మాత్రమే ఆ సమయంలో ప్రయాణికులను అనుమతించారు. దిగేందుకు మాత్రం అన్ని స్టేషన్లలోనూ అవకాశం కల్పించారు. ఎల్బీ నగర్-మియాపూర్, నాగోలు-రాయదుర్గం రూట్లలో ఏకంగా మూడున్నర లక్షల మంది ప్రయాణించినట్టు సమాచారం.
Next Story