Mon Dec 23 2024 14:07:00 GMT+0000 (Coordinated Universal Time)
WTC final : టెస్టు సమయంలో విజేతగా ఆస్ట్రేలియా
ఆసిస్ జట్టు నిర్దేశించిన 444 పరుగుల ఛేదనలో భారత్ 164/3తో చివరిరోజున ఆటను ప్రారంభించింది. ఆసిస్ బౌలింగ్ ధాటికి..
టెస్ట్ క్రికెట్ లో ప్రతిష్టాత్మకంగా భావించే WTC final 2023 (world test championship) లో భారత్ జట్టు అభిమానులను నిరాశపరిచింది. పేలవమైన ఆటతీరుతో మహాసమరంలో ఓటమిపాలైంది. దీంతో WTC final 2023 విజేతగా ఆస్ట్రేలియా నిలిచింది. వరుసగా రెండోసారి ఫైనల్ కు చేరిన భారత్.. ఈసారైనా టైటిల్ ను గెలిచి ఐసీసీ ట్రోఫీల కరువుని తీర్చుతుందన్న ఆశలపై రోహిత్ సేన నీళ్లు చల్లింది. కీలకమైన పోరులో 209 పరుగుల భారీ తేడాతో ఓటమిపాలైంది. దాంతో ఐసీసీ ట్రోఫీ భారత్ కు కలగానే మిలిగిపోయింది.
ఆసిస్ జట్టు నిర్దేశించిన 444 పరుగుల ఛేదనలో భారత్ 164/3తో చివరిరోజున ఆటను ప్రారంభించింది. ఆసిస్ బౌలింగ్ ధాటికి నిలబడలేకపోయింది. అభిమానులు ఎన్నో ఆశలు పెట్టుకున్న కోహ్లీ, రహానె వికెట్లు పడిపోయాయి. అక్కడి నుండి భారత్ జట్టు పతనం మొదలైంది. 49 పరుగులు చేసిన కోహ్లీ.. అర్థశతకానికి ఒక్కపరుగు దూరంలో స్మిత్ కు క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు. తర్వాత వచ్చిన జడేజా ఒక్కపరుగైనా చేయకుండానే వెనుదిరిగాడు. రహానే కూడా 46 పరుగులకు అలెక్స్ కారేకి క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు. శార్దూల్ ఎల్బీడబ్ల్యూ అవా.. కేఎస్ భరత్ 23 పరుగులకు ఔటయ్యాడు.
భారత్ తొలి ఇన్నింగ్స్ 296 పరుగులు, సెకండ్ ఇన్నింగ్స్ 234 ఆలౌట్ గా నిలిచింది. ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్ 469, సెకండ్ ఇన్నింగ్స్ 270-8 పరుగులతో ఐసీసీ టైటిల్ ను సొంతం చేసుకుంది.
Next Story