Mon Dec 23 2024 07:35:50 GMT+0000 (Coordinated Universal Time)
ఇండియా వర్సెస్ పాకిస్థాన్.. టీవీలో ఏ ఛానల్, మొబైల్ లో ఫ్రీగా చూడాలంటే?
ఆసియా కప్ 2023 బుధవారం అట్టహాసంగా ప్రారంభమైంది. టోర్నమెంట్‌లోని మొదటి మ్యాచ్‌లో
ఆసియా కప్ 2023 బుధవారం అట్టహాసంగా ప్రారంభమైంది. టోర్నమెంట్‌లోని మొదటి మ్యాచ్‌లో పాకిస్థాన్ 238 పరుగుల భారీ తేడాతో విజయం సాధించింది. ఆ మ్యాచ్ లో పసికూన నేపాల్ ను మట్టికరిపించిన పాకిస్థాన్.. భారత్ తో నేడు తలపడనుంది. ఆసియా కప్ క్రికెట్ టోర్నమెంట్లో భాగంగా శ్రీలంకలోని పల్లెకెలె అంతర్జాతీయ స్టేడియంలో శనివారం నాడు భారత్‌తో పాకిస్థాన్ తలపడనుంది. పాకిస్థాన్‌కు ఇది రెండో మ్యాచ్ కాగా, భారత్ కు ఇదే మొదటి మ్యాచ్. ప్రపంచంలోనే అత్యుత్తమ వన్డే జట్టులో భారత్ ఒకటి. ఈ మ్యాచ్ లో ఖచ్చితంగా భారత్ విజయం సాధిస్తుందని అభిమానులు ఆశిస్తూ ఉన్నారు.
శ్రీలంకలోని క్యాండీలోని పల్లెకెలె అంతర్జాతీయ స్టేడియంలో సెప్టెంబర్ 2న భారత్, పాకిస్థాన్ జట్లు తలపడనున్నాయి. 50 ఓవర్ల మ్యాచ్ మధ్యాహ్నం 3:00 గంటలకు (IST) ప్రారంభమవుతుంది.
భారత జట్టు:
భారత్: రోహిత్ శర్మ (కెప్టెన్), శుభ్‌మన్ గిల్, విరాట్ కోహ్లీ, శ్రేయాస్ అయ్యర్, సూర్యకుమార్ యాదవ్, తిలక్ వర్మ, కేఎల్ రాహుల్, ఇషాన్ కిషన్, హార్దిక్ పాండ్యా (వైస్ కెప్టెన్), రవీంద్ర జడేజా, శార్దూల్ ఠాకూర్, అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్, జస్ప్రీత్ బుమ్రా మొహమ్మద్ షమీ, మొహమ్మద్. సిరాజ్, ప్రసిద్ కృష్ణ
స్టాండ్ బై ప్లేయర్: సంజు శాంసన్
పాకిస్థాన్: బాబర్ అజామ్ (కెప్టెన్), అబ్దుల్లా షఫీక్, ఫఖర్ జమాన్, ఇమామ్-ఉల్-హక్, సల్మాన్ అలీ అఘా, ఇఫ్తీకర్ అహ్మద్, తయ్యబ్ తాహిర్, మహ్మద్ రిజ్వాన్, మహ్మద్ హరీస్, షాదాబ్ ఖాన్, మహ్మద్ నవాజ్, ఉసామా మీర్, ఫహీమ్ అష్రఫ్, హరీస్ రౌఫ్ , మొహమ్మద్ వాసిం జూనియర్, నసీమ్ షా, షాహీన్ అఫ్రిది.
భారత్ vs పాక్: ఏ ఛానల్ లో వీక్షించవచ్చంటే?
స్టార్ స్పోర్ట్స్ నెట్‌వర్క్‌లో ఆసియా కప్ గ్రూప్ స్టేజ్ మ్యాచ్ ప్రత్యక్ష ప్రసారాన్ని చూడవచ్చు. పలు భాషల్లో మ్యాచ్ ను చూడొచ్చు.
ఆన్ లైన్ లో ప్రత్యక్ష ప్రసారం:
నేడే ఇండియా వర్సెస్ పాకిస్థాన్.. టీవీలో ఏ ఛానల్.. మొబైల్ లో ఫ్రీగా చూడాలంటే? మొబైల్ యాప్, వెబ్సైట్లో మ్యాచ్ ప్రత్యక్ష ప్రసారాన్ని కూడా చూడవచ్చు. మొబైల్ యూజర్లు ఉచితంగానే మ్యాచ్ ను చూడొచ్చు.
Next Story