Mon Dec 23 2024 07:24:31 GMT+0000 (Coordinated Universal Time)
ఇంత జరుగుతూ ఉన్నా కూడా ఒప్పుకోని రోహిత్ శర్మ
ఎంతో అనుభవం ఉన్న భువనేశ్వర్ కుమార్ నుండి.. యువ కెరటం అర్షదీప్ సింగ్ దాకా ఇదే తరహాలో బౌలింగ్ వేస్తూ వస్తున్నారు. ఇది ఎంతో కలవరపెట్టే అంశం.
భారత జట్టు మరో టీ-20 సిరీస్ ను నెగ్గింది. అది కూడా దక్షిణాఫ్రికా మీద స్వదేశంలో ఇప్పటి వరకూ సిరీస్ గెలవలేదు. ఆ ముచ్చట కూడా తీరిపోయింది. అయితే భారత్ ను విపరీతంగా కలవరపెడుతున్న అంశం డెత్ ఓవర్లలో సరిగా బౌలింగ్ వేయలేకపోతూ ఉండడం. ఇప్పటికే ఆసియా కప్ నిష్క్రమణకు కారణమైంది డెత్ ఓవర్లలో బౌలింగ్ సరిగా వేయకపోవడం. అలాగే ఆస్ట్రేలియా సిరీస్ లో కూడా డెత్ ఓవర్లలో ఎంతో చెత్తగా బౌలింగ్ వేస్తూ వస్తున్నారు. ఎంతో అనుభవం ఉన్న భువనేశ్వర్ కుమార్ నుండి.. యువ కెరటం అర్షదీప్ సింగ్ దాకా ఇదే తరహాలో బౌలింగ్ వేస్తూ వస్తున్నారు. ఇది ఎంతో కలవరపెట్టే అంశం. దక్షిణాఫ్రికాతో సిరీస్ లో ఇంకొక్క టీ20 మ్యాచ్ మాత్రమే ఉంది.. ఆ తర్వాత టీ20 వరల్డ్ కప్ కు వెళుతోంది భారత్. అక్కడ ఏ మాత్రం తేడా కొట్టినా బయటకు వచ్చేయాల్సిందే.. ఎంతో మంది అభిమానులకు నిరాశ తప్పదు.
రెండో టీ-20 తర్వాత భారత జట్టు కెప్టెన్ రోహిత్ శర్మ మాట్లాడుతూ.. డెత్ ఓవర్లలో బౌలింగ్ సమస్య భారత్ కు లేదని చెప్పుకొచ్చాడు. "భారత జట్టు ఒక నిర్దిష్ట మార్గంలో ఆడాలని.. బౌలింగ్ చేయాలని కోరుకుంటుంది. మేము బౌలర్లకు ఆ విశ్వాసాన్ని అందించాలనుకుంటున్నాము. గత ఐదు లేదా ఆరు గేమ్‌లలో డెత్ ఓవర్లలో మేము బాగా బౌలింగ్ చేయలేదు. మా ప్రత్యర్థులను కూడా అలాగే చేస్తున్నాం. డెత్ ఓవర్ల వద్ద బౌలింగ్ చేయడం, బ్యాటింగ్ చేయడం చాలా కఠినమైనది.. అక్కడే ఆట నిర్ణయించబడుతుంది." అని తెలిపాడు రోహిత్.
టీమ్ ఇండియా ఇప్పుడు తమ చివరి ద్వైపాక్షిక మ్యాచ్‌ను అక్టోబర్ 4, 2022న ఇండోర్‌లోని హోల్కర్ క్రికెట్ స్టేడియంలో ఆడనుంది. తమ ప్రపంచ కప్ ప్రయాణాన్ని ప్రారంభించడానికి ముందు ఆడే ఆఖరి టీ20 మ్యాచ్. ఈ మ్యాచ్ లో భారత జట్టు తమ ప్రణాళికలను ఖచ్చితంగా అమలు చేయడానికి ప్రయత్నిస్తుందని భావిస్తూ ఉన్నారు.
Next Story