Mon Dec 23 2024 13:34:23 GMT+0000 (Coordinated Universal Time)
నేడే ఇండియా వర్సెస్ పాకిస్థాన్
బుధవారం నాడు ACC ఎమర్జింగ్ టీమ్స్ పురుషుల ఆసియా కప్ 2023లో పాకిస్థాన్ Aతో భారత్ A జట్టు తలపడనుంది
ఇండియా వర్సెస్ పాకిస్థాన్ మ్యాచ్ అంటే ఆ మజానే వేరు. ముఖ్యంగా క్రికెట్ లో ఆ రైవలరీని ఎంజాయ్ చేస్తూ ఉంటారు. దగ్గరలో ఆసియా కప్ లోనూ, వరల్డ్ కప్ లోనూ భారత్ మెయిన్ టీమ్ పాకిస్థాన్ తో తలపడుతూ ఉండగా.. నేడు కూడా ఓ కీలక మ్యాచ్ లో భారత్.. పాకిస్థాన్ తో తలపడనుంది. అది కూడా యువకులు పోరాడుతూ ఉండడంతో మ్యాచ్ మంచి మజాను ఇవ్వబోతోంది.
బుధవారం నాడు ACC ఎమర్జింగ్ టీమ్స్ పురుషుల ఆసియా కప్ 2023లో పాకిస్థాన్ Aతో భారత్ A జట్టు తలపడనుంది. ఈ సిరీస్ లో అద్భుతంగా భారత్ ఆడుతూ వెళుతోంది. యష్ ధుల్ నేతృత్వంలోని ఇండియా A జట్టుకు టోర్నమెంట్ లో ఓటమి అన్నదే ఎదురవ్వలేదు. ఇప్పుడు సెమీ ఫైనల్ లో పాకిస్థాన్ తో గెలిచి ఫైనల్ చేరాలని భారత జట్టు భావిస్తూ ఉంది. భారత్ ఈ టోర్నమెంట్ లో యూఏఈ A, నేపాల్ A జట్లను ఓడించింది. ఈ టోర్నీలో పాకిస్థాన్ కూడా అజేయంగా నిలిచింది.
కొలంబోలోని ప్రేమదాస స్టేడియంలో ఈ మ్యాచ్ జరగనుంది. మొబైల్, ఇంటర్నెట్ ద్వారా ఈ మ్యాచ్ లను వీక్షించాలంటే ఫ్యాన్ కోడ్ యాప్, సైట్ లో లాగిన్ అవ్వాల్సి ఉంటుంది. ఇండియా A vs పాకిస్తాన్ A, ACC పురుషుల ఎమర్జింగ్ ఆసియా కప్ 2023 మ్యాచ్ భారత కాలమానం ప్రకారం మధ్యాహ్నం 2:00 గంటలకు ప్రారంభమవుతుంది. ఈ మ్యాచ్ భారతదేశంలోని స్టార్ స్పోర్ట్స్ నెట్వర్క్లో ప్రత్యక్ష ప్రసారం చేయనున్నారు.
IND A vs PAK A ఎమర్జింగ్ ఆసియా కప్ స్క్వాడ్స్
ఇండియా A: సాయి సుదర్శన్, అభిషేక్ శర్మ (vc), నికిన్ జోస్, ప్రదోష్ రంజన్ పాల్, యష్ ధుల్ (c), రియాన్ పరాగ్, నిశాంత్ సింధు, ప్రభ్సిమ్రాన్ సింగ్ (wk), ధృవ్ జురెల్ (wk), మానవ్ సుతార్, యువరాజ్సిన్హ్ దోడియా, హర్షిత్ రాణా, ఆకాష్ సింగ్, నితీష్ కుమార్ రెడ్డి, రాజవర్ధన్ హంగర్గేకర్. స్టాండ్ బైస్: హర్ష్ దూబే, నెహాల్ వధేరా, స్నెల్ పటేల్, మోహిత్ రెడ్కర్.
పాకిస్థాన్ A: మహ్మద్ హారిస్ (c, wk), ఒమైర్ బిన్ యూసుఫ్ (vc), అమద్ బట్, అర్షద్ ఇక్బాల్, హసీబుల్లా, కమ్రాన్ గులాం, మెహ్రాన్ ముంతాజ్, ముబాసిర్ ఖాన్, మహ్మద్ వసీం జూనియర్, ఖాసిం అక్రమ్, సాహిబ్జాదా ఫర్హాన్, సైమ్ అయూబ్, సయీమ్ అయూబ్, , సుఫియాన్ ముఖీమ్, తయ్యబ్ తాహిర్.
Next Story