Thu Dec 26 2024 22:29:47 GMT+0000 (Coordinated Universal Time)
India-Afghanistan first t20 : టాస్ గెలిచిన ఇండియా.. తొలుత ఫీల్డింగ్ చేయనున్న భారత్
ఇండియా - ఆప్ఘనిస్థాన్ తొలి టీ 20 మ్యాచ్ మరికాసేపట్లో ప్రారంభం కానుంది. టాస్ గెలిచి భారత్ ఫీల్డింగ్ ఎంచుకుంది
ఇండియా - ఆప్ఘనిస్థాన్ తొలి టీ 20 మ్యాచ్ మరికాసేపట్లో ప్రారంభం కానుంది. టాస్ గెలిచి భారత్ ఫీల్డింగ్ ఎంచుకుంది. తొలుత ఆప్ఘనిస్తాన్ బ్యాటింగ్ చేయనుంది. ఆప్ఘనిస్థాన్ తో టీం ఇండియా మొత్తం మూడు టీ 20 మ్యాచ్ లను ఆడనుంది. ఇందులో తొలి మ్యాచ్ నేడు మొహాలీలో జరగనుంది. మొహాలీ పిచ్ బ్యాటింగ్ కు అనుకూలంగా ఉంటుందని చెబుతున్నారు.
స్పిన్నర్లకు అనుకూలంగా...
స్పిన్నర్లకు కూడా అనుకూలంగా ఉండే అవకాశాలున్నాయన్న అంచనాలు వినపడుతున్నాయి. బౌలర్లు తక్కువ పరుగులకు కట్టడి చేయాల్సి ఉంటుంది. ఆప్ఘనిస్థాన్ ను ఎంత తక్కువ పరుగులకు అవుట్ చేయగలిగితే అంత భారత్ కు అనుకూలంగా మారనుంది. ఈ నేపథ్యంలో భారత్ - ఆప్ఘనిస్తాన్ లమధ్య జరిగే మ్యాచ్ లో గెలుపు ఎవరిదన్న ఉత్కంఠ నెలకొంది.
Next Story