Fri Dec 20 2024 12:20:53 GMT+0000 (Coordinated Universal Time)
India vs Srilanka : దేశం ఏది కాదన్నాయ్యా.. విక్టరీ మాదేనంటున్న టీం ఇండియా
మూడు టీ20 సిరీస్ లలో భాగంగా శ్రీలంకలో జరిగిన రెండో మ్యాచ్ లోనూ భారత్ విజయం సాధించింది.
టీ20 వరల్డ్ కప్ లో సూపర్ విక్టరీ సాధించిన భారత్ జట్టు తర్వాత తన విజయాలను వరసగా నమోదు చేస్తూ వస్తుంది. ఇటీవల జింబాబ్వేలో జరిగిన టీ 20 సిరీస్ ను కైవసం చేసుకుని కుర్రాళ్లు కుమ్మేశారు. తొలి మ్యాచ్ లో ఓడిపోయినా తర్వాత మ్యాచ్ లన్నీ తమ పరం చేసుకుని సత్తా చాటారు. ఇక తాజాగా శ్రీలంక లో జరుగుతున్న టీ 20 సిరీస్ ను కూడా భారత్ కైవసం చేసుకుంది. యువజట్టు ఉరకలేస్తుంది. తమకు టీ 20లలో ఎదురు లేదని చెప్పకనే చెబుతుంది. దేశం ఏదైనా కావచ్చు. టీ20 అంటేనే మనోళ్లు చెలరేగి ఆడుతున్నారు. ఇటు బౌలింగ్, అటు బ్యాటింగ్ పరంగా జట్టు పటిష్టంగా ఉంది. దీనికి తోడు గౌతమ్ గంభీర్ కోచ్ గా బాధ్యతలను చేపట్టిన తర్వాత శ్రీలంకపై టీ 20 సిరీస్ ను గెలిచి ఇదీ మా సత్తా అని చెప్పారు.
సిరీస్ కైవసం...
మూడు టీ20 సిరీస్ లలో భాగంగా శ్రీలంకలో జరిగిన రెండో మ్యాచ్ లోనూ భారత్ విజయం సాధించింది. రెండో మ్యాచ్ లో ఏడు వికెట్ల తేడాతో విజయం సాధించింది. మూడు టీ 20 సిరీస్ లో భారత్ 2-0 ఇప్పటికే ఆధిపత్యం ప్రదర్శించింది. మరొక మ్యాచ్ మిగిలి ఉండగానే సిరీస్ ను కైవసం చేసుకోగలిగింది. బౌలర్లు, బ్యాటర్లు ఇద్దరూ సమిష్టిగా రాణించడంతోనే ఈ విజయం సాధ్యమయింది. టాస్ గెలిచిన భారత్ జట్టు తొలుత ఫీల్డింగ్ ఎంచుకుంది. తొలుత బ్యాటింగ్ కు దిగిన లంకేయులను కట్టడి చేయడంలో మన బౌలర్లు రాణించారు. ఇరవై ఓవర్లలో కేవలం 161 పరుగులు మాత్రమే లంక చేయగలిగింది. కీలక సమయంలో రవి బిష్ణోయ్ మూడు వికెట్లు తీసి లంక వెన్ను విరిచాడు. హార్ధిక్ పాండ్యా, లక్షర్ పటేల్, అర్ష్దీప్ సింగ్ తలో రెండు వికెట్లు తీసి లంకను తక్కువ పరుగులకే అవుట్ చేయగలిగారు.
డక్వర్త్ లూయీస్...
అయితే తర్వాత వర్షం ప్రారంభమయింది. భారత్ లక్ష్యం 162 పరుగులు. అయితే వర్సం కారణంగా అంపైర్లు మ్యాచ్ ను పన్నెండు ఓవర్లకు కుదించారు. డక్వర్త్ లూయీస్ పద్ధతి ప్రకారం ఎనిమిది ఓవర్లలో భారత్ 78 పరుగులు చేయాలని నిర్ణయించారు. సంజూ శాంసన్ వెంటనే అవుటయ్యారు. కానీ యశస్వి జైశ్వాల్ పదిహేను బంతుల్లో 30 పరుగులు చేశాడు. సూర్యకుమార్ యాదవ్ పన్నెండు బంతుల్లో 26 పరుగులు చేశాడు. ఇక తర్వాత క్రీజులోకి వచ్చిన హార్ధిక్ పాండ్యా 9 బంతుల్లోనే 22 పరుగులు చేసి జట్టుకు విజయాన్ని అందించాడు. 6.3 ఓవర్లలోనే తమ లక్ష్యాన్ని సాధించింది. దీంతో భారత్ జట్టు మరో మ్యాచ్ మిగిలి ఉండగానే లంకపై సిరీస్ ను కైవసం చేసుకుంది. ఇక మిగిలిన మరో మ్యాచ్ మాత్రం నామమాత్రమే. అది కూడా భారత్ పరమయితే క్లీన్ స్వీప్ చేసినట్లవుతుంది.
Next Story