Mon Dec 23 2024 08:16:11 GMT+0000 (Coordinated Universal Time)
రెండో మ్యాచ్ లో గెలుపు.. సిరీస్ భారత్ కైవసం
జింబాబ్వేతో జరుగుతున్న రెండో వన్డేలో కూడా భారత్ విజయం సాధించింది. వన్డే సిరిస్ ను గెలుచుకుంది
జింబాబ్వేతో జరుగుతున్న రెండో వన్డేలో కూడా భారత్ విజయం సాధించింది. వన్డే సిరిస్ ను గెలుచుకుంది. 162 పరుగుల లక్ష్యాన్ని సులువుగా ఛేదించింది. 25.4 ఓవర్లలోనే అనుకున్న లక్ష్యాన్ని చేరుకుంది. ఐదు వికెట్లను కోల్పోయి భారత్ విజయాన్ని దక్కించుకుంది. దీంతో మూడు వన్డేల సిరీస్ ను భారత్ మరొక వన్డే మ్యాచ్ మిగిలి ఉండగానే దక్కించుకుంది. తొలుత బ్యాటింగ్ కు దిగిన జింబాబ్వే జట్టు 161 పరుగులకే ఆల్ అవుట్ అయింది. 38.1 పరుగులకే అన్ని వికెట్లను కోల్పోయింది. జింబాబ్వే జట్టులో సీన్ విలియమ్స్ 42, రైన్ బర్డ్ 39 రుగులు తప్ప ఎవరూ పెద్దగా పరుగులు చేయలేకపోయారు.
సులువుగానే...
భారత బౌలర్లలో శార్దూల్ ఠాగూర్ మూడు, సిరాజ్ ప్రసిద్ధ్ , అక్షర్ పటే్, కులదీప్ యాదవ్, దీపక్ హుడా తలా ఒక వికెట్ తీసుకున్నారు. భారత బ్యాట్స్ మెన్లలో దీపక్ హుడా, సంజూ శాంసన్, శుభమన్ గిల్ లో మెచ్చుకోదగిన స్కోరు చేశారు. చివరి ఒక పరుగుతో విజయం దక్కుతుందనగా సంజూ శాంసన్ సిక్సర్ కొట్టి భారత్ కు విజయాన్ని సాధించిపెట్టారు. 25.4 ఓవర్లలోనే భారత్ అనుకున్న లక్ష్యాన్ని సాధించింది. మూడో వన్డే సోమవారం జరగనుంది.
Next Story