Mon Dec 23 2024 20:31:32 GMT+0000 (Coordinated Universal Time)
వన్ డే సిరీస్ మనదే.. భారత్ దే విజయం
వెస్టిండీస్ తో జరుగుతున్న రెండో వన్డే లో కూడా భారత్ విజయం సాధించింది
వెస్టిండీస్ తో జరుగుతున్న రెండో వన్డే లో కూడా భారత్ విజయం సాధించింది. కొంత బ్యాటింగ్ లో తడబడినా బౌలింగ్ లో సత్తా చాటి వెస్టిండీస్ బ్యాట్స్ మెన్లను నిలువరించింది. తక్కువ లక్ష్యాన్ని ముందుంచిని వెస్టిండీస్ ఛేదించలేకపోయింది. టాస్ గెలుచుకున్న వెస్టిండీస్ తొలుత బౌలింగ్ ను ఎంచుకుంది. తొలుత బ్యాటింగ్ కు దిగిన భారత్ తొలి ఓవర్లలోనే టాప్ ఆర్డర్ బ్యాట్స్ మెన్ లు పెవిలియన్ దారి పట్టారు.
భారత్ బ్యాటింగ్ లో...
రోహిత్ శర్మ, విరాట్ కొహ్లి 18 పరుగులు చేసి అవుటయ్యారు. రిషబ్ పంత్ ఎప్పటిలాగానే అవుటయి నిరాశపర్చాడు. అనంతరం వచ్చిన కేఎల్ రాహుల్, సూర్యకుమార్ నిలదొక్కుకుని స్కోర్ బోర్డును పరుగులు తీయించారు. యాభై ఓవర్లలో 9 వికెట్ నష్టానికి భారత్ 237 పరుగులు చేసింది. వీరిలో అత్యధికంగా సూర్యకుమార్ యాదవ్ 66 పరుగులు చేశారు.
టాప్ ఆర్డర్.....
ఆ తర్వాత బరిలోకి దిగిన వెస్టిండీస్ బ్యాట్స్ మెన్ లు ఆరంభంలోనే తడబడ్డారు. టాప్ ఆర్డర్ ను భారత్ బౌలర్లు కుప్పకూల్చేశారు. దీంతో వెస్టిండీస్ ఓటమి తప్పదని ఖాయమైంది. అయితే స్మిత్ వరసగా రెండు సిక్సర్లు బాదడంతో వెస్టిండీస్ విజయం వైపు ఉందని అంచనా విన్పించింది. కానీ ఆ తర్వాత భారత బౌలర్లు ఆల్ అవుట్ చేసి జట్టును 44 పరుగుల తేడాతో గెలిపించారు. దీంతో వన్ డే సిరీస్ భారత్ పరమయింది.
- Tags
- india
- west indies
Next Story