Mon Dec 23 2024 12:34:14 GMT+0000 (Coordinated Universal Time)
India vs Australia T20 : "స్కై" చేతిలో యంగ్ ఇండియా.. ఏం చేస్తారోనన్న టెన్షన్లో ఫ్యాన్స్
మరికాసేపట్లో ఇండియా - ఆస్ట్రేలియా టీ 20 మ్యాచ్ ప్రారంభం కానుంది. ఇండియా కెప్టెన్ గా సూర్యకుమార్ యాదవ్ వ్యవహరిస్తున్నారు
మరికాసేపట్లో ఇండియా - ఆస్ట్రేలియా టీ 20 మ్యాచ్ ప్రారంభం కానుంది. విశాఖ వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్ లో ఇండియా కెప్టెన్ గా సూర్యకుమార్ యాదవ్ వ్యవహరిస్తున్నారు. కానీ వరల్డ్ కప్ లో సూర్యకుమార్ యాదవ్ పెద్దగా ప్రభావం చూపలేకపోయాడు. చేతికి వచ్చిన అవకాశాన్ని మిస్ చేసుకున్నాడు. ఫైనల్స్ లో కూడా సూర్య విఫలం కావడంతో ఆయనపై ఫ్యాన్స్ ఆశలు పెద్దగా లేవు. సూర్యకుమార్ ను కెప్టెన్ గా చేయడమేంటని సోషల్ మీడియాలో నెటిజన్లు మండి పడుతున్నారు.
పాండ్యా గాయపడటంతో...
హార్ధిక్ పాండ్యా గాయపడటంతోనే సూర్యకుమార్ యాదవ్ ను టీ 20 సిరీస్ కు కెప్టెన్ గా చేశారు. నిజానికి సూర్యకుమార్ యాదవ్ ను తక్కువగా అంచనా వేయకూడదు. సూర్య బాట్ కున్న పవర్ మామూలుది కాదు. సిక్సర్లు, ఫోర్లతో స్కోరు బోర్డును పరుగులు తీయిస్తాడు. తాను క్రీజులో ఉన్నంత సేపు రన్ రేటును పెంచేందుకే స్కై ప్రయత్నిస్తాడన్నది ఎవరైనా అంగీకరించే విషయం. మిస్టర్ 360 గా పేరుపొందిన సూర్యకుమార్ యాదవ్ గతంలో ఒకదుమ్ము దులిపాడు. అందుకే టీం ఇండియాలో సుస్థిర స్థానం సంపాదించుకున్నాడు.
అందరూ అలవోకగానే...
ఇక ప్రస్తుత టీంలో ఓపెనర్లుగా రుతురాజ్ గైక్వాడ్, యశస్వి జైశ్వాల్ బరిలోకి దిగే అవకాశముంది. ఇషాన్ కిషన్ కూడా అనుభవంతో పాటు నిలబడితే స్కోరును పెంచేందుకు అవకాశాలున్నాయి. తిలక్ వర్మ కొంత నిదానంగా ఆడినా నిలకడైన ప్లేయర్ గా టీ 20లలో గుర్తింపు పొందాడు. రింకూ సింగ్ సంగతి చెప్పనవసరం లేదు. డెత్ ఓవర్లలో రన్ రేటును పరుగులు తీయిస్తాడు. వాష్టింగ్టన్ సుందర్, శివమ్ దూబే, అక్షర్ పటేల్ కూడా ఆల్ రౌండర్లుగా గతంలో తమ ప్రతిభను చాటు కున్నవారే. అందుకే యంగ్ ఇండియా ఇప్పుడు స్కై చేతిలో ఏమవుతుందేనే కన్నా పాజిటివ్ గానే ఆలోచించడం మంచిదనే సూర్యకుమార్ యాదవ్ ను కెప్టెన్ గా ఎంపిక చేశారు. మరి ఈ మ్యాచ్ లో మనోళ్లు ఏం చేస్తారన్నది చూడాలి.
Next Story