Fri Nov 22 2024 10:01:19 GMT+0000 (Coordinated Universal Time)
పంత్ పంతం చూడాల్సిందే
మూడో వన్డేలో భారత్ ఇంగ్లండ్ పై ఐదు వికెట్ల తేడాతో గెలిచింది. సిరీస్ ను కైవసం చేసుకుంది.
రెండో మ్యాచ్ ఓటమి పాలయిన భారత్ సిరీస్ ను దక్కించుకోవడానికి ముఖ్యమైన మ్యాచ్ ను కోల్పోతుందని అందరూ భావించారు. కానీ పంత్ పంతంతో ఆడి భారత్ కు విజయాన్ని చేకూర్చారు. టాస్ గెలిచిన భారత్ తొలుత ఫీల్డింగ్ ఎంచుకుంది. బౌలర్లు విజృంభించారు. సిరాజ్, హార్దిక్ ప్యాండ్యాలు ఇంగ్లండ్ బ్యాట్స్మెన్లను కట్టడి చేశారు. దీంతో ఇంగ్లండ్ 259 పరుగులకే అవుట్ అయింది. 259 పరుగులు భారత్ కు నిజంగా పెద్ద లక్ష్యమేమీ కాదు. సులువుగా గెలుస్తుందని అందరూ అనుకున్నారు.
టాప్ ఆర్డర్ కుప్పకూలినా...
కానీ భారత్ టాప్ ఆర్డర్ కుప్పకూలింది. శిఖర్ ధావన్ , రోహిత్ శర్మ, విరాట్ కొహ్లి వరసగా అవుట్ కావడంతో భారత్ అభిమానుల్లో నిరాశ మొదలయింది. సూర్యకుమార్ యాదవ్ కూడా కాసేపు క్రీజ్ లో ఉండటంతో కొంత ఆశలు రేపాడు. కానీ సూర్యకుమార్ కూడా అవుట్ కావడంతో చాలా మంది టీవీలు స్విచాఫ్ చేశారు. అయితే పంత్ పట్టుదలతో ఆడారు. పంత్, హార్ధిక్ పాండ్యా భాగస్వామ్యం అదిరింది. హర్థిక్ పాండ్యా 71 పరుగులు చేయగా, రిషబ్ పంత్ 125 పరుగులు చేసి భారత్ ను గెలిపించాడు. ఫలితంగా మూడో వన్డేలో భారత్ ఇంగ్లండ్ పై ఐదు వికెట్ల తేడాతో గెలిచింది. సిరీస్ ను కైవసం చేసుకుంది.
Next Story