Mon Dec 15 2025 08:08:32 GMT+0000 (Coordinated Universal Time)
Vinesh Phogat : ఒలింపిక్స్ లో ఇండియాకు షాక్...వినేశ్ ఫొగాట్ పై అనర్హత వేటు
ఒలింపిక్స్ లో ఇండియాకుషాక్ తగిలింది. భారత్ రెజ్లర్ వినేశ్ ఫొగాట్ పై అనర్హత వేటు పడింది. అధిక బరువు కారణమని చెప్పారు

ఒలింపిక్స్ లో ఇండియాకుషాక్ తగిలింది. భారత్ రెజ్లర్ వినేశ్ ఫొగాట్ పై అనర్హత వేటు పడింది. ఫైనల్ చేరడంతో ఆమెకు గోల్డ్, సిల్వర్ మెడల్ వస్తుందని అందరూ భావించారు. సంతోషపడ్డారు. కాని అందుకు విరుద్ధంగా వినేశ్ ఫొగాట్ పోటీ నుంచి తప్పుకోవాల్సి వచ్చింది. ఆమె పై అనర్హత వేటు పడటానికి కారణం బరువు పెరగడమే.
బరువు అధికమే...
వినేశ్ ఫొగాట్ ఉండాల్సిన బరువు కంటే ఎక్కువ ఉన్నారు. ఉండాల్సిన బరువు కంటే వందగ్రాములు అధికంగా ఉండటంతో ఆమెపై ఒలింపిక్స్ నిర్వాహకులు అనర్హత వేటు వేశారు. దీంతో పతకాన్ని భారత్ చేజారింది. లేకుంటే ఖచ్చితంగా వినేశ్ ఫొగాట్ స్వర్ణ పతకం సాధించి ఉండేదని చెబుతున్నారు. తనపై అనర్హత వేటు పడగానే వినేశ్ ఫొగాట్ కన్నీటి పర్యంత మయ్యారు. అక్కడే ఏడుస్తూ నిలబడి పోయారు.
Next Story

