Mon Mar 17 2025 01:40:24 GMT+0000 (Coordinated Universal Time)
Champions Trophy : అనుకుంటాం కానీ... ఆ ముగ్గురి వల్లనే ట్రోఫీలో ఇన్ని విజయాలు కదూ
ఛాంపియన్స్ ట్రోపీలో భారత్ ఈసారి ఏ జట్టుకు లేని రికార్డులను సొంతం చేసుకుంది

ఛాంపియన్స్ ట్రోపీలో భారత్ ఈసారి ఏ జట్టుకు లేని రికార్డులను సొంతం చేసుకుంది. లీగ్ మ్యాచ్ ల నుంచి వరస విజయాలను సొంతం చేసుకుంది. ఓటమి అనేది లేకుండా కప్పును కొట్టేసింది. బంగ్లాదేశ్, పాకిస్థాన్, న్యూజిలాండ్ మీద లీగ్ మ్యాచ్ లలో గెలిచిన టీం ఇండియా సెమీ ఫైనల్స్ లో ఆస్ట్రేలియాతో తలపడింది.ఆస్ట్రేలియాను కూడా ఓడించి ఫైనల్స్ కు చేరుకుంది. ఐదో మ్యాచ్ ఫైనల్ లో న్యూజిలాండ్ ను ఓడించి ఛాంపియన్స్ ట్రోఫీని 2013 తర్వాత సొంతం చేసుకోగలిగింది. ఈ ఐదు మ్యాచ్ లలో భారత్ అన్ని సార్లూ టాస్ లను ఓడింది. ప్రత్యర్థి ఎంచుకున్న ప్రకారమే ఆడినప్పటికీ ఇటు తొలుత బ్యాటింగ్ చేసినా, తర్వాత ఛేదనలోనూ తనకు తిరుగులేదని పించుకుంది.
బౌలర్లు రాణించడంతో...
ఇక్కడ ఒక విషయం చెప్పాలంటే.. ప్రధానంగా సమిష్టిగా ఈ ఛాంపియన్స్ ట్రోఫీలో రాణించారు. బౌలర్లు ఎప్పటికప్పుడు వికెట్లు తీస్తూ భారత్ జట్టుపై వత్తిడి తగ్గించగలిగారు. ప్రత్యర్థి జట్టును డైలమాలోకి నెట్టడంలో బౌలర్లు సక్సెస్ అయ్యారు. షమి, వరుణ్ చక్రవర్తి ఒక్కో మ్యాచ్ లో ఐదో వికెట్లు తీసి అవతలవారి పతనాననిశాసించారు. ఇక అన్ని మ్యాచ్ లు దుబాయ్ లోనే జరగడంతో అక్కడ స్పిన్నర్లదే పై చేయి అయింది. అందుకే భారత్ ఐదు మ్యాచ్ లలోనూ నలుగురు స్పిన్నర్లతో బరిలోకి దిగింది. కులదీప్ యాదవ్, వరుణ్ చక్రవర్తి, రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్ తమ స్పిన్ మాయాజాలంతో ప్రత్యర్థులను చిత్తు చేయగలిగారు. బౌలర్లు చేసిన పని టీం ఇండియావిజయానికిసులువుగా మారింది.
ఫామ్ లోకి రావడంతో...
ఇక మరో విషయం ఏంటంటే.. సీనియర్లు ఫామ్ లోకి రావడం. ట్రోఫీ ఆరంభానికి ముందుఅనేక అనుమానాలు. సందేహాలు ఉన్నాయి. భారత్ అభిమానుల్లో కలవరం పూర్తి స్థాయిలో ఉంది. రోహిత్ శర్మ, విరాట్ కోహ్లి, కే ఎల్ రాహుల్ లు అంతకు ముందు వరసగా విఫలమవుతుండటంతో వారు ఈ ట్రోఫీలో ఆడేతీరుపై అనేక అనుమానాలు కలిగాయి. కానీ వాటిని పటాపంచలు చేస్తూ అందరూ ఫామ్ లోకి వచ్చారు. విరాట్ కోహ్లి పాకిస్థాన్ పై సెంచరీ నమోదు చేసి విజయం తెప్పించగలిగాడు. రోహిత్ శర్మ ఫైనల్ లో న్యూజిలాండ్ తో జరిగిన మ్యాచ్ లో అత్యధిక పరుగులు వేగంగా చేసి జట్టుపై కొంత భారం తగ్గించగలిగాడు. ఇక కేఎల్ రాహుల్ మ్యాచ్ విన్నర్ గా చివర వరకూ నిలిచి కప్పును ఇండియా దక్కించుకోవడం కీలక భూమిక పోషించాడు. ఇలా ముగ్గురు సీనియర్లు ట్రోఫీని ముద్దాడేందుకు శ్రమించారు.
Next Story