Tue Dec 24 2024 03:09:51 GMT+0000 (Coordinated Universal Time)
దక్షిణాఫ్రికా టార్గెట్ 288 పరుగులు
సౌతాఫ్రికాపై భారత్ భారీ లక్ష్యాన్ని ఉందించింది. రిషబ్ పంత్, కేఎల్ రాహుల్ భాగస్వామ్యంతో భారత్ భారీ పరుగులు చేసింది.
సౌతాఫ్రికాపై భారత్ భారీ లక్ష్యాన్ని ఉందించింది. సౌతాఫ్రికా మొదటి వన్డేలో పరాజయం పాలయిన భారత్ రెండో వన్డేలో ఎలాగైనా గెలవాలని భావించింది. టాస్ కూడా భారత్ కు దక్కడంతో మొదట బ్యాటింగ్ ను ఎంచుకుంది. అయితే శిఖర్ థావన్ 29 పరుగులకు అవుట్ అయి నిరాశపర్చారు. విరాట్ కొహ్లి కూడా ఏమీ పరుగులు చేయకుండానే అవుటయ్యాడు. కొహ్లి తర్వాత బ్యాటింగ్ కు వచ్చిన రిషబ్ పంత్ నిలదొక్కుకున్నాడు.
వీిరిద్దరి భాగస్వామ్యంతో....
రిషబ్ పంత్, కేఎల్ రాహుల్ భాగస్వామ్యంతో భారత్ భారీ పరుగులు చేసింది. రిషబ్ పంత్ 85 పరుగులు, కేఎల్ రాహుల్ 55 పరుగులు, శార్దూల్ ఠాగూర్ 40 పరుగులు టీం ఇండియాలో అత్యధిక స్కోరు చేశారు. ప్రస్తుతం సౌతాఫ్రికా బ్యాటింగ్ చేయాల్సి ఉంది. సౌతాఫ్రికా 288 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగనుంది. భారత్ 287 పరుగులు చేసి ఆరు వికెట్లను కోల్పోయింది.
Next Story