Tue Dec 24 2024 03:16:46 GMT+0000 (Coordinated Universal Time)
భారత్ ముందు భారీ టార్గెట్
సౌతాఫ్రికాతో జరుగుతున్న మూడే వన్డేలో భారత్ ముందు భారీ లక్ష్యమే ఉంది. 288 పరుగుల లక్ష్యంతో భారత్ బరిలోకి దిగాల్సి ఉంది
సౌతాఫ్రికాతో జరుగుతున్న మూడే వన్డేలో భారత్ ముందు భారీ లక్ష్యమే ఉంది. 288 పరుగుల లక్ష్యంతో భారత్ బ్యాటింగ్ కు దిగాల్సి ఉంది. కేప్ టౌన్ లో జరుగుతున్న మూడే వన్డేలో తొలుత బ్యాటింగ్ చేసిన సౌతాఫ్రికా 49.5 ఓవర్లలో ఆల్ అవుట్ అయింది. భారత్ బౌలర్లలో ప్రసిద్ధ్ కృష్ణ మూడు వికెకట్లు తీశారు. బూమ్రా రెండు, దీపక్ చాహర్ రెండు, చాహల్ ఒక వికెట్ తీశారు.
అత్యధికంగా....
సౌతాఫ్రికా బ్యాట్స్ మెన్ లలో డీకాక్ సెంచరీ సాధించి మరోసారి సీనియర్ ఆటగాడిననిపించుకున్నారు. ఓపెనర్ గా దిగిన డీకాక్ 124 పరుగులు చేశాడు. డస్సెన్ 52 పరుగులు సాధంచారు. వీరిద్దరే అత్యధికంగా స్కోరు చేసి సౌతాఫ్రికా పరువును నిలబెట్టగలిగారు. భారత్ ప్రస్తుతం 288 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగనుంది.
Next Story