Sun Dec 22 2024 16:43:51 GMT+0000 (Coordinated Universal Time)
India Vs Zimbabwe T20 : చెలరేగిపోతున్న కుర్రోళ్లు...అభిషేక్ శర్మ సూపర్ సెంచరీ
భారత్ రెండో టీ 20 మ్యాచ్ లో తేరుకుంది. జింబాబ్వేతో జరగుతున్న మ్యాచ్ లో కుర్రోళ్లు చెలరేగిపోతున్నారు
భారత్ రెండో మ్యాచ్ లో తేరుకుంది. జింబాబ్వేతో జరగుతున్న మ్యాచ్ లో కుర్రోళ్లు చెలరేగిపోతున్నారు. అదే గ్రౌండ్..అయితే మొదటి టీ20 మ్యాచ్ లో ిజింబాబ్వేపై దారుణ ఓటమిని చవి చూశారు. 115 పరుగులు చేయలేక చేతులెత్తేశారు. 19.5 ఓవర్లలోనే ఆల్ అవుట్ అయి మ్యాచ్ ను చేజార్చుకున్నారు. మొత్తం ఐదు మ్యాచ్లున్న ఈ సిరీస్ ను గెలుచుకోవాలంటే హరారేలో జరుగుతున్న రెండో టీ20 మ్యాచ్ లో భారత్ కు విజయం సాధించడం అనివార్యంగా మారింది.
మొదటి బ్యాటింగ్ కు...
అయితే మొదట బ్యాటింగ్ కు దిగిన టీం ఇండియా బ్యాటర్లు దుమ్ము దులుపుతున్నారు. శుభమన్ గిల్ అవుట్ కాగా, రుతురాజ్ గైక్వాడ్ మాత్రం ఇంకా క్రీజులోనే ఉన్నాడు 43పరుగుల వద్ద రుతురాజ్ గైక్వాడ్ ఆడుతున్నాడు. అయితే అదే సమయంలో అభిషేక్ శర్మ మాత్రం చెలరేగిపోయాడు కేవలం 47 బంతుల్లోనే సెంచరీ చేశాడు. తక్కువ బాల్స్ లో సెంచరీ పూర్తి చేసిన అభిషేక్ శర్మ క్యాచ్ ఇచ్చి అవుటయ్యాడు. టీ20 లలో సెంచరీ చేసిన అభిషేక్ శర్మ అరుదైన ఘనత సాధించాడు.
అభిషేక్ శర్మ సెంచరీ...
ఇక భారత్ పదిహేడు ఓవర్లకు గాను రెండు వికెట్లు కోల్పోయి 177 పరుగులు చేసింది. మొదటి వికెట్ త్వరగా కోల్పోయినా, రెండో వికెట్ పడటానికి జింబాబ్వే బౌలర్లు చాలా కష్టపడ్డారు. అభిషేక్ శర్మ సెంచరీ చేసి అవుట్ కావడంతో ఊపిరి పీల్చుకున్నారు. భారత్ స్కోరు రెండు వందలు దాటే అవకాశాలున్నాయని పిస్తుంది. నిన్నటి మ్యాచ్ లో ఓడిపోయి విమర్శలు ఎదుర్కొన్న యంగ్ ఇండియా ఇప్పుడు ఈ మ్యాచ్ లో తేరుకుని కొంత బాగా ఆడుతుండటంతో ఫ్యాన్స్ ఖుషీ అవుతున్నారు.
Next Story