Fri Dec 20 2024 16:11:20 GMT+0000 (Coordinated Universal Time)
టాస్ గెలిచిన భారత్
భారత్ - న్యూజిలాండ్ మ్యాచ్ మరికాసేపట్లో ప్రారంభం కానుంది. టాస్ గెలిచిన భారత్ ఫీల్డింగ్ ను ఎంచుకుంది
భారత్ - న్యూజిలాండ్ మ్యాచ్ మరికాసేపట్లో ప్రారంభం కానుంది. రాయపూర్ వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్ లో టాస్ ను భారత్ గెలచుకుంది. టాస్ నెగ్గిన భారత్ ఫీల్డింగ్ ను ఎంచుకుంది. తొలుత భారత్ బౌలింగ్ చేయాలని నిర్ణయించుకుంది. తొలి వన్డేలో భారత్ తొలుత బ్యాటింగ్ చేసి 350 పరుగుల లక్ష్యాన్ని విధించినా న్యూజిలాండ్ ఛేదనలో తగ్గలేదు. చివరి ఓవర్ లో మ్యాజిక్ జరిగి మ్యాచ్ భారత్ పరమయింది.
ఫీల్డింగ్ ఎంచుకుని...
అయితే ఈసారి బౌలింగ్ తో ముందుగానే న్యూజిలాండ్ బ్యాటర్లను కట్టడి చేయాలని భారత్ భావిస్తున్నట్లుంది. అందుకోసమే బ్యాటింగ్, బౌలింగ్ కు అనుకూలమైన ఈ పిచ్ మీద తొలుత ఫీల్డింగ్ ఎంచుకుంది. న్యూజిలాండ్ ను తక్కువ స్కోరుకు కట్టడి చేయగలిగితేనే రెండో వన్డేలో భారత్ కు విజయం దక్కుతుంది. సిరీస్ నేటి మ్యాచ్ తో దక్కుతుంది. లేకుంటే మరో మ్యాచ్ లో పోరాడాల్సి ఉంటుంది.
- Tags
- india
- new zealand
Next Story