Fri Dec 20 2024 15:58:12 GMT+0000 (Coordinated Universal Time)
భారత్ - న్యూజిలాండ్ వన్డే మ్యాచ్ టై
భారత్ - న్యూజిలాండ్ వన్డే మ్యాచ్ టై గా ముగిసింది. రెండో వన్డే మ్యాచ్ వర్షం కారణంగా టైగా ముగిసింది.
భారత్ - న్యూజిలాండ్ వన్డే మ్యాచ్ టై గా ముగిసింది. రెండో వన్డే మ్యాచ్ వర్షం కారణంగా టైగా ముగిసింది. తొలుత టాస్ గెలిచిన న్యూజిలాండ్ ఫీల్డింగ్ ఎంచుకుంది. భారత్ బ్యాటింగ్ కు తొలుత దిగింది. శిఖర్ ధావన్ అతికొద్ది పరుగులకే అవుటయ్యారు. దీంతో సూర్యకుమార్ యాదవ్, శుభమన్ గిల్ లు క్రీజ్ లో నిలకడగా ఆడుతున్నారు. 12.5 ఓవర్ల వద్ద భారీ వర్షం కురవడంతో మ్యాచ్ నిలిచిపోయింది.
వర్షం రాకతో...
కొద్దిసేపు వేచి ఉన్న అంపైర్లు ఇక మ్యాచ్ నిర్వహణ సాధ్యం కాదని తేల్చారు. దీంతో న్యూజిలాండ్ - భారత్ మ్యాచ్ టై గా ముగిసినట్లు ప్రకటించారు. మూడు మ్యాచ్ ల వన్డే సిరీస్ లో ఇప్పటికే న్యూజిలాండ్ ఒక మ్యాచ్ గెలిచింది. దీంతో సిరీస్ లో 1 -0 ఆధిక్యంతో న్యూజిలాండ్ ఉంది. మూడో మ్యాచ్ లో భారత్ గెలిస్తే సిరీస్ సమం అవుతుంది. న్యూజిలాండ్ గెలిస్తే సిరీస్ గెలుచుకుంటుంది.
- Tags
- india
- new zealand
Next Story