Sun Dec 14 2025 23:38:03 GMT+0000 (Coordinated Universal Time)
Inida Vs New Zealand Test : ముంబయిలో నేటి నుంచి మూడో టెస్ట్
భారత్ - న్యూజిలాండ్ టెస్ట్ నేడు ప్రారంభం కానుంది. ముంబయి వేదికగా ఈ మ్యాచ్ ప్రారంభం కానుంది

భారత్ - న్యూజిలాండ్ టెస్ట్ నేడు ప్రారంభం కానుంది. వరసగా రెండు మ్యాచ్ లు ఓడిపోయిన భారత్ కు మూడో టెస్ట్ గెలవడం కీలకం. న్యూజిలాడ్ కూడా టెస్ట్ సిరీస్ ను భారత్ గడ్డపై క్లీన్ స్వీప్ చేయాలన్న తపనతో ఉంది. భారత్ న్యూజిలాండ్ పై ఇప్పటికే బెంగళూరు, పూణే టెస్ట్లలో దారుణంగా ఓటమిపాలయి పరువు పోగొట్టుకుంది. కనీసం ఈ చివరి టెస్ట్లోనైనా విజయం సాధించి తమలో పస తగ్గలేదని నిరూపించుకోగలగాలి.
ఈ మ్యాచ్ ఓడిపోతే...
దాదాపు పన్నెండేళ్ల తర్వాత సొంత గడ్డపై టీం ఇండియా సిరీస్ ఓటమిని కొని తెచ్చుకుంది. రెండు టెస్ట్ లు ఓడిపోవడంతో సిరీస్ ను చేజార్చుకుంది భారత్. ముంబయి వేదికగా జరిగే ఈ టెస్ట్ మ్యాచ్ లో గెలిచేందుకు రెండు జట్లు హోరాహోరీగా శ్రమిస్తున్నాయి. మూడోసారి టెస్ట్ ఛాంపియన్ షిప్ ఆడాలంటే ముంబయి మ్యాచ్ ను భారత్ ఖచ్చితంగా గెలవాల్సిందేనని క్రీడానిపుణులు చెబుతున్నారు. భారత్ స్వల్ప మార్పులతో ఈ మూడో టెస్ట్ లో బరిలోకి దిగనుంది.
Next Story

