Tue Nov 05 2024 03:32:22 GMT+0000 (Coordinated Universal Time)
పెనాల్టీ షూటౌట్ లో భారత్ విక్టరీ
ఛెత్రీ, అన్వర్, మహేశ్, ఉదాంత భారత్ తరఫున తమ తొలి నాలుగు పెనాల్టీలను గోల్ గా మలిచగా, లెబనాన్ తరఫున వాలిద్ షూర్, మహ్మద్
జూలై 1, 2023, శనివారం నాడు బెంగళూరులోని శ్రీ కంఠీరవ స్టేడియంలో జరిగిన SAFF ఛాంపియన్షిప్ సెమీ-ఫైనల్లో భారత్ లెబనాన్ జట్టుతో హోరా హోరీగా తలపడింది. అదనపు సమయం ముగిశాక కూడా ఇరు జట్లు గోల్ సాధించకపోవడంతో పెనాల్టీ షూటౌట్ ను నిర్వహించారు. ఇక షూటౌట్ లో భారత్ కు అదృష్టం వరించింది. పెనాల్టీలలో లెబనాన్‌ను 4-2తో ఓడించి ఫైనల్ కు భారత్ దూసుకువచ్చింది. జూలై 4న శ్రీ కంఠీరవ స్టేడియంలో కువైట్‌తో భారత్ తలపడనుంది. లెబనాన్ మ్యాచ్ లో భారత గోల్ కీపర్ గురుప్రీత్ సింగ్ సంధు అద్భుతంగా అడ్డుకోవడంతో భారత్ SAFF ఛాంపియన్షిప్స్ ఫైనల్లోకి ప్రవేశించింది.
ఛెత్రీ, అన్వర్, మహేశ్, ఉదాంత భారత్ తరఫున తమ తొలి నాలుగు పెనాల్టీలను గోల్ గా మలిచగా, లెబనాన్ తరఫున వాలిద్ షూర్, మహ్మద్ సాడెక్ మాత్రమే సక్సెస్ అయ్యారు. మిగిలిన వాళ్లు విఫలమవ్వడంతో భారత్ ఫైనల్ లోకి అడుగుపెట్టింది. పెనాల్టీ షూటౌట్లో భారత్ తరఫున సునీల్ ఛెత్రి, అన్వర్ అలీ, మహేష్ సింగ్, ఉదాంత్ సింగ్‌లు గోల్ చేశారు. లెబనాన్ ఆటగాడు హసన్ కొట్టిన తొలి కిక్‌ను భారత గోల్ కీపర్ అడ్డుకొన్నాడు. ఆ తర్వాత వలీద్ షోర్, సాదిక్ గోల్స్ చేశారు. అయితే, నాలుగో కిక్‌ను ఖలీల్ బాదర్ బయటకు కొట్టడంతో భారత్ మ్యాచ్ లో విజయాన్ని అందుకుంది. ఈ టోర్నీలో భారత్ ఫైనల్‌కు చేరడం ఇది 13వసారి. మరో సెమీస్ లో కువైట్ 1-0తో బంగ్లాదేశ్‌పై గెలిచింది. అదనపు సమయంలో అబ్దుల్లా అల్ బ్లోషి (105+2వ) లేటు గోల్‌తో కువైట్‌కు విజయాన్నందించాడు. నిర్ణీత సమయంలో ఇరు జట్లూ గోల్ చేయడంలో విఫలం కావడంతో.. మ్యాచ్ ఫలితం అదనపు సమయానికి దారి తీసింది. ఈ టోర్నీలో భారత్, కువైట్ జట్లు ఒక మ్యాచ్ లో తలపడగా.. మ్యాచ్ 1-1తో డ్రాగా ముగిసింది.
Next Story