Tue Nov 19 2024 00:52:00 GMT+0000 (Coordinated Universal Time)
అసలే గిల్ దూరం.. ఇప్పుడు ఆ స్టార్ ఆటగాడికి గాయం
ప్రపంచ కప్ ప్రారంభం ముందు నుండి భారత జట్టుకు టైమ్ ఏ మాత్రం కలిసి
ప్రపంచ కప్ ప్రారంభం ముందు నుండి భారత జట్టుకు టైమ్ ఏ మాత్రం కలిసి రావడం లేదు. ఇప్పటికే ప్రాక్టీస్ మ్యాచ్ లు వర్షార్పణం అయ్యాయి. ఇక మొదటి మ్యాచ్ కు సూపర్ డూపర్ ఫామ్ లో ఉన్న గిల్ కూడా దూరమయ్యాడు. స్టార్ బ్యాటర్ శుభ్‌మాన్ గిల్ ఆరోగ్య సమస్యలతో భాధపడుతూ ఉండడంతో ఆస్ట్రేలియాతో మ్యాచ్‌కు అతడు దూరమవ్వనున్నాడు. వన్డేల్లో భారత్ తరఫున అద్భుతంగా బ్యాటింగ్ చేస్తున్న గిల్, తీవ్ర జ్వరం కారణంగా ఆస్ట్రేలియా జట్టుతో జరిగే మ్యాచ్ కి అందుబాటులో ఉండడం సందేహాస్పదంగా ఉంది. గిల్ చెన్నైకి చేరుకున్నప్పటి నుండి అతని ఆరోగ్య పరిస్థితిపై ఆందోళన మొదలైందని బీసీసీఐ అధికారి తెలిపారు. చెన్నైలో దిగినప్పటి నుండి శుభ్‌మన్‌కు తీవ్రమైన జ్వరం ఉంది. పరీక్షలు చేయగా గిల్ డెంగ్యూ బారిన పడ్డాడని అంటున్నారు. గిల్ డెంగ్యూ నుండి కోలుకుని ఫిట్‌నెస్‌ని సంపాదించాల్సి ఉంది.
ఇప్పుడు భారత అభిమానులను, మేనేజ్మెంట్ ను టెన్షన్ పెట్టే మరో వార్త బయటకు వచ్చింది. భారత జట్టు ప్రాక్టీస్ సెషన్లో స్టార్ ఆల్ రౌండర్, వైస్ కెప్టెన్ హార్దిక్ పాండ్యా గాయపడ్డాడని నివేదికలు చెబుతున్నాయి. RevSportz ప్రకారం, గురువారం నాడు నెట్స్‌లో బ్యాటింగ్ చేస్తున్నప్పుడు 29 ఏళ్ల ఆల్ రౌండర్ హార్దిక్ పాండ్యా వేలికి గాయమైంది. ఆ తర్వాత అతను బ్యాటింగ్ చేయలేదు. కానీ ఆందోళన చెందాల్సిన పని లేదని, అది తీవ్రమైన గాయం కాదని అంటున్నారు. అతను ఆదివారం ఆస్ట్రేలియాతో ఆడే మ్యాచ్ కు అందుబాటులో ఉంటాడని నివేదికలు చెబుతున్నాయి. సెప్టెంబర్ 8న భారత్ ఆస్ట్రేలియాతో తలపడనుంది.
Next Story