Fri Nov 15 2024 04:45:25 GMT+0000 (Coordinated Universal Time)
ఇండియా వర్సెస్ బంగ్లాదేశ్.. టై గా ముగిసిన మ్యాచ్
మొదట బ్యాటింగ్ చేసిన బంగ్లాదేశ్ మహిళలు పర్వాలేదనిపించే ప్రదర్శన చేశారు. ఫర్గాన హాక్ 160 బంతుల్లో 107 పరుగులు చేసింది.
భారత మహిళలకు బంగ్లాదేశ్ మహిళలకు మధ్య జరిగిన వన్డే మ్యాచ్ టై గా నిలిచింది. ఓడిపోయే అవకాశాలు అతి తక్కువ అని భావించే తరుణంలో భారత్ మ్యాచ్ లో ఆలౌట్ అయ్యింది. మొదట బ్యాటింగ్ చేసిన బంగ్లాదేశ్ 50 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 225 పరుగులు చేయగా.. భారత జట్టు 49.3 ఓవర్లలో 225 పరుగులకు ఆలౌట్ అయింది. 4 వికెట్లు కోల్పోయి 191 పరుగులతో పటిష్ట స్థితిలో ఉన్న భారత్ చేజేతులా మ్యాచ్ ను కోల్పోయింది.
మొదట బ్యాటింగ్ చేసిన బంగ్లాదేశ్ మహిళలు పర్వాలేదనిపించే ప్రదర్శన చేశారు. ఫర్గాన హాక్ 160 బంతుల్లో 107 పరుగులు చేసింది. షమీమా సుల్తానా హాఫ్ సెంచరీ చేసింది. 50 ఓవర్ల పాటూ బ్యాటింగ్ చేసి 4 వికెట్ల నష్టానికి 225 పరుగులు చేసింది బంగ్లాదేశ్ జట్టు. ఆ తర్వాత ఛేజింగ్ లో భారత్ లక్ష్యం దిశగా వెళ్ళింది. కానీ చివర్లో చేతులెత్తేసింది. స్మ్రితి మందాన 59 పరుగులు చేయగా.. హర్లీన్ డియోల్ 77 పరుగులు చేసింది. జెమీమా 33 పరుగులు చేసి పర్వాలేదనిపించింది. అయితే మిగతా బ్యాటర్లు ఎవరూ కూడా సరిగా బ్యాటింగ్ చేయలేదు. ఇక ఆఖర్లో పేక మేడలా భారత్ వికెట్లు కోల్పోవడంతో మ్యాచ్ టైగా ముగిసింది. ఆఖరి ఓవర్లో మూడు పరుగులు చేయాల్సి ఉండగా.. భారత్ చేతిలో ఒక్క వికెట్ మాత్రమే ఉంది. మొదటి రెండు బంతులకు రెండు సింగిల్స్ రాగా.. మూడో బంతికి మేఘనా సింగ్ క్యాచ్ అవుట్ అవ్వడంతో భారత్ కు విజయం దూరమైంది. సూపర్ ఓవర్ లేకపోవడంతో ఫలితం టైగా ప్రకటించారు. ఇక మూడు మ్యాచ్ ల వన్డే సిరీస్ లో మొదటి మ్యాచ్ బంగ్లాదేశ్ గెలవగా.. రెండో మ్యాచ్ లో భారత్ గెలిచింది. మూడో మ్యాచ్ టై అవ్వడంతో సిరీస్ ను ఇరు దేశాలు పంచుకోనున్నాయి. ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ గా హర్లీన్ డియోల్ నిలవగా.. ఫర్గాన హాక్ కు ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ దక్కింది.
Next Story