Thu Dec 26 2024 12:02:59 GMT+0000 (Coordinated Universal Time)
5 మార్పులతో బంగ్లాదేశ్ తో టీమిండియా ఢీ
ఆసియాకప్లో సూపర్ ఫోర్ స్టేజ్లో బంగ్లాదేశ్, ఇండియా జట్ల మధ్య
ఆసియాకప్లో సూపర్ ఫోర్ స్టేజ్లో బంగ్లాదేశ్, ఇండియా జట్ల మధ్య మ్యాచ్ లో టాస్ గెలిచిన కెప్టెన్ రోహిత్ శర్మ బౌలింగ్ ఎంచుకున్నాడు. ఇప్పటికే భారత జట్టు ఫైనల్లోకి ప్రవేశించింది. బంగ్లాదేశ్ మాత్రం సూపర్ ఫోర్ స్టేజ్లో ఒక్క విజయాన్ని కూడా నమోదు చేయలేదు. బంగ్లాదేశ్తో మ్యాచ్ కోసం ఇండియా అయిదుగురు ప్లేయర్లను మార్చింది. తిలక్ వర్మను జట్టులోకి తీసుకున్నారు. సూర్యకుమార్ యాదవ్, షమీ, ప్రసిద్ధ కృష్ణ కూడా జట్టులోకి వచ్చాడు. కోహ్లీ, బుమ్రా, హార్దిక్, సిరాజ్, కుల్దీప్ లకు రెస్ట్ ఇచ్చారు.
భారత్ (ప్లేయింగ్ XI): రోహిత్ శర్మ(సి), శుభమన్ గిల్, సూర్యకుమార్ యాదవ్, తిలక్ వర్మ, కేఎల్ రాహుల్(w), ఇషాన్ కిషన్, రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్, శార్దూల్ ఠాకూర్, మహమ్మద్ షమీ, ప్రసిద్ధ్ కృష్ణ
బంగ్లాదేశ్ జట్టు: లిట్టన్ దాస్(w), తాంజిద్ హసన్, అనముల్ హక్, షకీబ్ అల్ హసన్(c), తౌహిద్ హృదయ్, షమీమ్ హొస్సేన్, మెహిదీ హసన్ మిరాజ్, మహేదీ హసన్, నసుమ్ అహ్మద్, తంజిమ్ హసన్ సాకిబ్, ముస్తాఫిజుర్ రెహమాన్
Next Story